ప్రియురాలికి వేరే పెళ్లి నిశ్చ‌యం.. ప్రియుడు కారుతో వెళ్లి..

Update: 2021-04-18 08:30 GMT
పెళ్లికి స‌వాల‌క్ష అంశాలు లెక్క‌లోకి వ‌స్తాయి.. ప్రేమ‌కు మాత్రం ఒక్క‌టే అంశం. ల‌వ‌ర్ ను ద‌క్కించుకోవ‌డ‌మే! దానికోసం ఏం చేయ‌డానికైనా సిద్ధ‌ప‌డ‌తారు కొంద‌రు. చంప‌డానికి, చావ‌డానికైనా సిద్ధ‌ప‌డ‌తారు మ‌రికొంద‌రు. ఇలాంటి ల‌వ్ స్టోరీయే ఇది.

హైద‌రాబాద్ న‌గ‌రంలోని మైలార్ దేవ్ ప‌ల్లి పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. పాత‌బ‌స్తీకి చెదిన ఓ యువ‌కుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాల‌ని ఎన్నో క‌ల‌లు క‌న్నాడు. మ‌రి, వీరి ఈ విష‌యం వాళ్ల ఇంట్లో తెలిసిందో ఏమోగానీ.. అమ్మాయికి వేరే పెళ్లి సంబంధం చూశారు పేరెంట్స్‌. ఈ విష‌యం తెలుసుకున్న ప్రేమికుడు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యాడు. వెంట‌నే ఓ ప్లాన్ వేశాడు.

త‌న ప్రియురాలిని పెళ్లి చేసుకోబోయే వ్య‌క్తిని కిడ్నాప్ చేయ‌డానికి ప‌థ‌కం వేశాడు. ఎన్నిసార్లు రెక్కీ నిర్వ‌హించాడో తెలియ‌దుగానీ.. తాజాగా పెళ్లికొడుకు బైక్ పై వెళ్తుండ‌గా.. కారుతో వెళ్లిన ప్రియుడు అడ్డ‌గించాడు. కిడ్నాప్ చేసి అత‌న్ని కారులో తీసుకొని వెళ్లిపోయాడు. అయితే.. ఈ వ్య‌వ‌హారం మొత్తం సీసీ టీవీలో రికార్డ్ అయ్యింది.

దాని ఆధారంగా పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అయితే.. నిందితుడు పెళ్లికొడుకును ఎక్క‌డికి తీసుకెళ్లాడ‌న్నది ఇంకా తెలియ‌లేదు. కిడ్నాప్ వ్య‌వ‌హారంలో ఎంత‌మంది పాల్గొన్నార‌న్న‌ది కూడా తేలాల్సి ఉంది. నిందితుల కోసం పోలీసులు వెతుకులాట ‌మొద‌లు పెట్టారు.
Tags:    

Similar News