గత కొన్నేళ్లుగా స్వలింగ సంపర్కులైన పురుషులు, ట్రాన్స్ జెండర్లు బయటకొచ్చి తాము ఎదుర్కొంటున్న సమస్యల పై మాట్లాడటం పెరుగుతోంది. అయితే, మహిళా స్వలింగ సంపర్కులు మాత్రం అంత స్వేచ్ఛగా మాట్లాడటంలేదు. ఇదిలా ఉంటే .. ఇద్దరమ్మాయిలు ఒకరినొకరు ఇష్టపడ్డారు. కొన్నాళ్లు సహజీవనం చేశారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆ ఇద్దరు అమ్మాయిలు తమ ఇండ్లలో ఎవరికీ చెప్పకుండా వెళ్లి పెళ్లి చేసుకున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే ... జార్ఖండ్, కొదెర్మ జిల్లాకు చెందిన ఇద్దరు అమ్మాయిలు గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇంట్లో వారికి ఈ విషయం చెబితే ఒప్పుకోరని భావించారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ ఇంటినుంచి బయటకు వచ్చేశారు. నవంబర్ 8వ తేదీన గుడిలో పెళ్లి చేసుకున్నారు. కొద్దిరోజుల క్రితం వారి ఇళ్లకు ఆరు కిలోమీటర్ల దూరంలోని చంద్రచౌక్ ప్రాంతంలో ఇళ్లు అద్దెకు తీసుకుని కాపురం మొదలుపెట్టారు. వీరు చంద్రచౌక్ లో ఉంటున్నారని తెలుసుకున్న ఇరు కుటుంబాల వారు అక్కడికి చేరుకుని గొడవ చేశారు. ఇద్దరు అమ్మాయిలు మేజర్లు కావటంతో పోలీసులు జోక్యం చేసుకోమని చెప్పి వెళ్లిపోయారు. దీనిపై ఆ అమ్మాయిలు మాట్లాడుతూ.. దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని మమ్మల్ని మా కుటుంబాలు బెదిరిస్తున్నాయి. మేం దాన్ని లెక్క చేయం. ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న మేము గుడిలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యాం. త్వరలో మా పెళ్లిని కోర్టు ద్వారా చట్టబద్దం చేయటానికి ప్రయత్నిస్తామని చెప్పారు.