ఇక్కడ అమ్మాయిలకే డిమాండ్

Update: 2019-09-07 01:30 GMT
కోట్ల సంపాదన ఉన్నా ఆ కోట్లను కరిగించే కొడుకులు ఎంతో మంది మన సమాజంలో ఉన్నారు.. వారసుల కోసం తపన పడే తల్లిదండ్రులు తమ వారసత్వాన్ని నిలబెట్టే మగసంతానం కావాలని ఆరాటపడుతారు. తొలి కాన్పు ఆడపిల్ల పుడితే మలికాన్పు మగబిడ్డ కోసం ఎన్నో అబార్షన్లను చేసిన వారిని చూశాం..

కానీ నిజానికి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను అక్కున చేర్చుకోవడంలో కొడుకుల కన్నా కూతుళ్లే ముందున్నారని ఓ సర్వే తేల్చింది. కొడుకులున్న వారు కాలదన్నితే.. ఆడబిడ్డలు మాత్రం తమ తల్లిదండ్రులను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటారని తేలింది. తల్లిదండ్రులపై ప్రేమ కురిపించడంలో ఆడబిడ్డలే ముందుంటారని మన సమాజంలో చూస్తే అర్థమవుతుంది. కొడుకులు పెళ్లాల మాట విని కన్నతల్లిదండ్రులను వదిలేయడం.. వృద్ధాశ్రమంలో చేర్పించడం చేస్తుండడం విరివిగా జరుగుతోంది

అయితే పిల్లలు ఉన్న వాళ్ల కథ ఇదీ.. కానీ సంతానం లేని దంపతులు కూడా ఇప్పుడు తమ వారసత్వం నిలుపుకోవడానికి దత్తత తీసుకుంటారు. అయితే ఇప్పుడు దత్తత విషయంలో ఏ జంట కూడా మగపిల్లాడిని తీసుకోవడానికి ఆసక్తి చూపకపోవడం షాకింగ్ లా మారింది. కోటీశ్వరుల నుంచి సామాన్యుల దాకా ఇప్పుడు దత్తత విషయంలో అమ్మాయిలనే ఎంపిక చేసుకుంటుండడం విశేషం.

జీవిత చరమాంకంలో ప్రేమ - అనురాగం - అప్యాయతలను అందించడంలో అబ్బాయిలకంటే అమ్మాయిలే బెటర్ అని తల్లిదండ్రులు భావిస్తున్నారు. ప్రస్తుత సమాజ పోకడలు - వాస్తవ సంఘటనలతో అమ్మాయిలే బెటర్ అని అభిప్రాయపడుతున్నారు. అందుకే కేంద్రం ప్రభుత్వం పెట్టిన దత్తత వెబ్ సైట్ లో 90శాతం మంది తమకు అమ్మాయిలే దత్తత తీసుకోవడానికి కావాలని పేర్కొనడం విశేషం. కృష్ణా - గుంటూరులోని మూడు శిశుగృహల్లో కూడా అమ్మాయిలనే 90శాతం మంది దత్తత తీసుకోవడం విశేషంగా మారింది.
Tags:    

Similar News