ప్రపంచంలోనే అతి చవక మెడిసిన్ మాదే: కేంద్రానికి గ్లెన్‌మార్క్ వివరణ
ప్రపంచంలోనే నాణ్యతకు.. అతి తక్కువ ధరకు ఔషధాలు మనదేశంలోనే లభిస్తాయి. అందుకే ప్రపంచ దేశాలన్నీ భారత ఔషధ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాయి. ప్రస్తుత మహమ్మారి వైరస్ వ్యాపించిన సమయంలోనూ అమెరికాతో సహా ప్రపంచ దేశాలు భారత్ నుంచి మందులు ఎగుమతి చేసుకుంటున్నది మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం మహమ్మారి వైరస్‌కు విరుగుడు మందు కనిపెట్టడంలో కూడా మన దేశం ముందుంది. త్వరలోనే వైరస్‌కు వ్యాక్సిన్ రాబోతోంది. ఈ క్రమంలో భారతదేశమంతా ఆ వైరస్‌కు విరుగుడుగా ఆవిష్కరించిన ఫాబిఫ్లూ మెడిసిన్‌పై ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే ఈ మందు విషయంపై ఒక ఆసక్తికరమైన అంశం తెలిసింది. ఈ మందు దేశంలోనే అతి తక్కువ ధరకు లభించేది అని తేలింది.
ఈ విషయాన్ని ముంబై కేంద్రంగా పనిచేసే గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్ కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. భారత్‌లోనే కాకుండా విదేశాల్లో కూడా మిగతా వైరస్ నివారణ మందులతో పోలిస్తే ఫాబిఫ్లూ తక్కువ ధర అని గ్లెన్‌మార్క్ వివరించింది. ప్రస్తుతం వైరస్ నివారణకు అందుబాటులోకి వస్తున్నఇతర మందులు రెమ్డెసివిర్, టాసిలీజుమాబ్, ఇతోలిజుమాబ్ ధరలను పోల్చి చూస్తే ఫాబిఫ్లూ తక్కువ ఉందని వెల్లడించింది. ఈ మందు కంటే వాటి ధరలు మూడు నుంచి ఐదు రెట్లు అధికమని కంపెనీ పేర్కొంది. ఫాబిఫ్లూ పని తీరుపై కేంద్ర ప్రభుత్వం వివరణ కోరడంతో ఈ విధంగా తెలిపింది. ఫాబిఫ్లూ ధర సామాన్యులకు అందుబాటులో ఉందని కేంద్ర ప్రభుత్వానికి గ్లెన్‌మార్క్ వివరణ ఇచ్చింది.
వైరస్ నివారణ చికిత్సలో పనిచేసే యాంటి వైరల్ ఔషదం ఫవిపిరవిర్‌ను ఫాబిఫ్లూ పేరుతో గ్లెన్‌మార్క్ మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. దాని రూ.103కు ఒక ట్యాబ్లెట్ అని నిర్ణయించింది. ఈ ట్యాబ్లెట్ వైరస్ నుంచి కోలుకునేందుకు రెండు వారాలపాటు వాడాలని కంపెనీ తెలిపింది. అంటే ఒక్కో ట్యాబ్లెట్ 14 వారాల పాటు వేసుకుంటే కోర్సు పూర్తయ్యే సరికి రూ.12,500 ఖర్చు అవుతుంది. దీంతోపాటు ఫవిపిరవిర్ మందుతో శ్వాస సంబంధ వ్యాధులు ఉన్న వైరస్ బాధితులపై సరిగా పనిచేయడం లేదని ఆరోపణలు వచ్చాయి. ఈ విధంగా అధిక ధరలు.. మందు సక్రమంగా పని చేయడం లేదని విమర్శలు.. ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కేంద్రం గ్లెన్‌మార్క్ సంస్థను వివరణ కోరడంతో పై విధంగా సమాధానం ఇచ్చింది. అయితే ఈ విమర్శలతో గ్లెన్‌మార్క్ సంస్థ వెనక్కి తగ్గింది. ఆ ట్యాబ్లెట్లపై ధరను 27 శాతం ధర తగ్గించింది. ధర తగ్గడంతో ఒక్కో ట్యాబ్లెట ధర రూ.75కు మార్కెట్‌లో అందుబాటులో ఉంది.