చెన్నై.. ద సేఫెస్ట్ సిటీ ఇన్ ఇండియా

Update: 2016-02-26 07:46 GMT
ఇండియాలో అత్యంత సురక్షిత నగరంగా చెన్నై గుర్తింపు పొందింది. హైదరాబాద్  - ఢిల్లీ - ముంబయి - బెంగళూరు - కోల్ కతా వంటి నగరాల కంటే చెన్నై నగరం అత్యంత సురక్షితమైనదని తేలింది. 'మెర్చర్ గ్లోబల్ సర్వీసెస్ కన్సల్టెన్సీ' సంస్థ నిర్వహించిన సర్వేలో దేశంలోని ప్రధాన నగరాల్లో చెన్నై ది బెస్ట్ టు లివ్ అని నిరూపణ అయింది.
   
చెన్నైలో నేరాలు బాగా తక్కువట. శాంతి భద్రతలు కూడా బాగున్నాయట. తీవ్రవాద చర్యలు, అల్లర్లు, హింసాకాండలకు చెన్నై నగరం చాలా దూరంగా ఉందని ఈ సర్వేలో తేలింది. చెన్నై ప్రజలు చట్టానికి, న్యాయానికి లోబడి జీవనం గడుపుతున్నారని ఈ సర్వే వెల్లడించింది. ఇక సౌకర్యాల విషయానికొస్తే విద్యా సదుపాయాలు, రవాణా సౌకర్యాలు వంటివన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయని చెబుతున్నారు.
   
ప్రపంచవ్యాప్తంగా 230 నగరాలపై ఈ సర్వే చేయగా సురక్షిత నగరాల జాబితాలో ఇండియన్ సిటీస్ లో చెన్నై టాప్ లో ఉంది. అయితే.. ప్రపంచ ర్యాంకు చూసుకుంటే మాత్రం చెన్నైకు 113వ స్థానం వచ్చింది. మరోవైపు నాణ్యమైన జీవన పరిస్థితుల పరంగా చెన్నైకు ప్రపంచంలోనే నాలుగో స్థానం దక్కింది. వ్యక్తిగత భద్రతలో టాప్ ప్లేస్ లో లగ్జెంబర్గ్ నగరం నిలవగా.... జీవన నాణ్యత విషయంలో వియన్నా టాప్ ప్లేస్ అందుకుంది.
Tags:    

Similar News