దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించే రీతిలో సాగుతున్న సీఎం మనోహర్ పారికర్ పాలన మరిన్ని పదనిసలు చోటుచేసుకున్నాయి. పాంక్రియాటిక్ క్యాన్సర్ తో బాధపడుతున్న పారికర్.. గత 9 నెలలుగా చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన అక్టోబర్ 15వ తేదీన గోవా మంత్రివర్గ సమావేశం ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో నిర్వహించి అందరి దృష్టిని తనవైపు ఆకట్టుకున్నారు. మరోవైపు అనారోగ్యంతో బాధపడుతున్నారన్న కారణంగా తన కేబినెట్ లోని ఇద్దరు మంత్రులను తొలగించి గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ సంచలనం సృష్టించారు. మిత్రపక్ష సర్కారుకు సారథ్యం వహిస్తున్న పారికర్ బీజేపీకి చెందిన ప్రాన్సిస్ డిసౌజా - పాండురంగ్ మడ్ కైకర్ లను తొలగించిన వీళ్లద్దరి స్థానంలో కొత్త వాళ్లను తీసుకున్నారు.
ఇలా సంచలన - ఆసక్తికర పరిణామాలతో తెరమీదకు వచ్చిన గోవా సీఎం ఎపిసోడ్ తాజాగా మరో మలుపు తిరిగింది. మనోహర్ పారికర్ తన పదవికి రాజీనామా చేయాలని గోవా లో ఇవాళ ప్రతిపక్షాలు భారీ ప్రదర్శన చేపట్టాయి. చికిత్స పూర్తై ప్రస్తుతం పనాజీలోని తన ఇంట్లో ఉంటున్న పారికర్ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలతో పాటు మిగితా విపక్షాలు డిమాండ్ చేశాయి. పీపుల్స్ మార్చ్ ఫర్ రెస్టోరేషన్ ఆఫ్ గవర్నెన్స్ పేరుతో ఆందోళనకారులు ర్యాలీ తీశారు. పారికర్ ఇంటి వైపు భారీ ఎత్తున వెళ్లారు. అయితే పోలీసులు ఆ ర్యాలీని అడ్డుకున్నారు. 48 గంటల్లో పారికర్ తన పదవికి రాజీనామా చేయాలని - ఆ తర్వాత వెంటనే పూర్తి స్థాయి కొత్త సీఎంను ప్రకటించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. పారికర్ అనారోగ్యం వల్ల గోవా కూడా అనేక నష్టాలు ఎదుర్కొంటోందన్నారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ఎన్సీపీ - శివసేన పార్టీలు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నాయి.
కాగా, 40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో బీజేపీ 14 సీట్లు గెలుపొంది ఎంజీపీ - జీఎఫ్ పీ - ఎన్ సీపీతో పాటు మరో ముగ్గురు స్వతంత్రుల సహాకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. విపక్ష కాంగ్రెస్ 16 స్థానాల్లో గెలుపొందింది. సంకీర్ణ సర్కారుకు సారథ్యం వహిస్తున్న పారికర్ ఈ సమయంలో ఇటు ఆస్పత్రిలో చేరడం అటు వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంతో గోవా రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి.