గోవా సీఎం మనోహర్ పారికర్ క్యాన్సర్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం వ్యక్తిగతంగా వెళ్లి పారికర్ ను కలిసిన సంగతి తెలుసు కదా. ఆ విషయాన్ని బుధవారం ఓ సమావేశంలో ప్రస్తావిస్తూ...రాఫెల్ డీల్ ను మార్చే సమయంలో ప్రధాని మోడీ రక్షణ మంత్రికి కూడా ఆ విషయం చెప్పలేదు అని పారికర్ నాతో చెప్పారు అని రాహుల్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై పారికర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నీ రాజకీయ లబ్ధి కోసం నన్ను వాడుకుంటావా? అంటూ పారికర్ ఆవేదన వ్యక్తం చేశారు.
రాహుల్ భేటీపై ఓ లేఖను కూడా పారికర్ విడుదల చేశారు. ``నీ అవసరాల కోసం నన్ను పరామర్శించావని తెలిసి చాలా బాధ కలుగుతోంది. అసలు ఐదు నిమిషాల ఆ భేటీలో రాఫెల్ అంశం మన మధ్య చర్చకు వచ్చిందా?` అని పారికర్ ప్రశ్నించారు. `అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులను పరామర్శించడానికి వెళ్లి దానిని నీ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోకు` అని రాహుల్‌కు పారికర్ సూచించారు. `నిజాలను మీరే బయటపెడతారని ఆశిస్తున్నా. మీరు చేసిన ఈ వ్యాఖ్యలు మీ చిత్తశుద్ధిని శంకించేలా ఉన్నాయి` అని రాహుల్‌పై పారికర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రక్షణ శాఖ కొనుగోళ్ల విధానం ప్రకారమే రాఫెల్ డీల్ జరిగిందని మరోసారి పారికర్ స్పష్టం చేశారు. కాగా, రాహుల్ ఈ ఎపిసోడ్‌లో సెల్ఫ్ గోల్ చేసుకున్నారని అంటున్నారు.