న‌య‌గార జ‌లపాతాల స‌వ్వ‌డితో పోటీ ప‌డి భోజ‌న‌ప్రియుల‌ను అల‌రించ‌నున్న గోదావ‌రి

Update: 2018-06-15 13:30 GMT
ద‌క్షిణాది వంట‌కాల‌తో అమెరికాలో సుప‌రిచిత‌మైన గోదావ‌రి మ‌రో కీల‌కమైన కేంద్రంలో త‌న రెస్టారెంట్‌ను అందుబాటులోకి తెచ్చింది.

అమెరికాలో అత్య‌ధికులు సంద‌ర్శించే న‌యాగరా జ‌ల‌పాతం వ‌ద్ద‌నున్న పార్క్ వ‌ద్ద గోదావ‌రి త‌న రెస్టారెంట్‌ను ఏర్పాటు చేసింది.

ప్ర‌తిఏటా పెద్ద సంఖ్య‌లో ప‌ర్యాట‌కులు ప్ర‌ధానంగా వేస‌విలో న‌యాగ‌రా జ‌ల‌పాతాల అందాల‌ను తిల‌కించేందుకు విచ్చేస్తుంటారు. అయితే, వారికి చ‌క్క‌టి భార‌తీయ భోజ‌‌నాన్ని ఆస్వాదించే అవ‌కాశం లేదు. ఈ నేప‌థ్యంలో భార‌తీయ ప‌ర్యాట‌కుల‌తో పాటుగా...ఈ వంట‌కాల‌ను ఆస్వాదించే ప్ర‌తి ఒక్క‌రికీ న‌చ్చే రుచుల‌తో గోదావ‌రి న‌యాగ‌రాలో ఏర్పాట‌యింది.

న‌యాగరా ప్రాంతంలో “గోదావ‌రి” ప్రారంభోత్స‌వం (Indian restaurant in Niagara Falls) ద్వారా వంద‌ల ఏళ్లుగా సుందరమైన ఈ జలపాతాల చెంత భార‌తీయ రుచుల‌ను ఆస్వాదించాల‌నుకునే వారి ఆకాంక్ష నెర‌వేరిన‌ట్ల‌యింది. న‌యాగ‌రా జ‌ల‌పాత పార్క్ నుంచి అతి స‌మీపంలో ఉన్న ఈ రెస్టారెంట్ వంద‌సీట్ల సామ‌ర్థ్యం క‌లిగి ఉంది.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా భార‌తీయులు అడుగుపెట్టిన ప్ర‌తి చోటులో ఆత్మీయ రుచుల‌ను అందించ‌డం టీం గోదావ‌రి ల‌క్ష్యం. ఇందులో భాగంగా న‌యాగ‌రా వంటి అద్భుత‌మైన ప‌ర్యాట‌క కేంద్రం వ‌ద్ద అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశాన్ని వ‌దులుకునేందుకు “టీం గోదావ‌రి” సిద్ధంగా లేదు.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ప‌ర్యాట‌కులంద‌రినీ ఆక‌ట్టుకుంటున్న న‌యాగ‌రా జ‌ల‌పాతం వ‌ద్ద ద‌క్షిణ భార‌తీయులు అంద‌రూ మెచ్చే ద‌మ్ బిర్యానీ, దోసాను ఆస్వాదించ‌లేక పోతున్నామ‌ని, ఇలాంటి సౌల‌భ్యం ఉంటే బాగుంటుంద‌ని ఎంద‌రో అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ క్ర‌మంలో “గోదావ‌రి” ఫ్రాంచైజీని ఏర్పాటు చేసేందుకు విశేష శ్ర‌మ‌కోర్చి అందరినీ ఆక‌ట్టుకునే రీతిలో “గోదావ‌రి”ని సిద్ధం చేశామ‌ని స్థానికంగా గోదావ‌రి వ్య‌వ‌హారాలు చూస్తున్న జ‌శ్వంత్ రెడ్డి ముక్కా తెలిపారు.

గోదావ‌రి న‌యాగ‌రా ప్ర‌తిరోజు ఉద‌యం 11 గంట‌ల‌కు మొద‌లై రాత్రి 10 గంట‌ల‌కు అతిథుల‌కు ఆతిథ్యం అందిస్తుంది (Best South Indian restaurant in Niagara Falls).  ప్ర‌తిరోజూ బ‌ఫెట్ సౌల‌భ్యం అందుబాటులో ఉంది. దీంతోపాటుగా అతిథులు త‌మ‌కు న‌చ్చిన రుచుల‌ను ఆర్డ‌ర్ చేసుకునే అవ‌కాశం కూడా అందుబాటులో ఉంది.

న‌యాగరా జ‌ల‌పాతం సమీపంలో ప్రామాణిక‌మైన భార‌తీయ రుచుల‌ను, అందుబాటు ధ‌ర‌లో అందించే ఏకైక రెస్టారెంట్ గోదావ‌రి ఒక్క‌టే కావ‌డం విశేషం. అంతేకాకుండా న‌వంబ‌ర్ మాసం మొత్తం తెరిచే ఉంటుంది. మొట్ట‌మొద‌టి ద‌క్షిణాది రెస్టారెంట్‌ను ప్రారంభించ‌డం ద్వారా ఈ ప్రాంతంలో తాము రికార్డును సృష్టిస్తున్నామ‌ని టీం గోదావ‌రికి చెందిన రాజ మున‌గ ఈ సంద‌ర్భంగా హర్షం వ్యక్తం చేశారు.

అమెరికాలో ప్రారంభ‌మై ద‌క్షిణాది రుచుల‌ను ప్ర‌ముఖ ప్రాంతాల‌న్నింటిలో అందిస్తున్న సంస్థ‌గా గోదావ‌రి నిలిచింది. రాబోయే రెండు నెల‌ల్లో మ‌స్క‌ట్‌, ఒమ‌న్‌ల‌లో త‌న రుచుల‌ను గోదావ‌రి అందించ‌నుంది. ఒమ‌న్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్ నుంచి కొన్ని నిమిషాల ప్ర‌యాణం వ్య‌వ‌ధి స‌మీపంలో గోదావ‌రి ఏర్పాటు కానుంది. ఈ కొత్త రెస్టారెంట్ వినియోగదారుల మనసు దోచుకునే రీతిలో బాంక్వెట్ స‌దుపాయం క‌లిగి ఉంది.

కెన‌డాలో భార‌తీయ రుచుల‌ను చేర‌వేసేందుకు స‌రైన భాగ‌స్వామ్యుల కోసం గోదావ‌రి అన్వేషిస్తోంది. త‌ద్వారా అక్క‌డి భార‌తీయ భోజ‌న ప్రియుల‌కు సైతం త‌మ మాధుర్య వంట‌కాల‌ను అందించ‌నుంది. ఆస‌క్తి క‌ల‌వారు త‌మ అభిప్రాయాన్ని వెల్ల‌డిస్తూ
Franchise@godavarius.com
కు ఈ మెయిల్ చేయ‌వ‌చ్చు. ఆక‌ట్టుకునే న‌యాగరా అందాల‌ను అనుభూతి చెందుతూనే...అద్భుత‌మైన గోదావ‌రి రుచుల‌ను సైతం ఆస్వాదించేందుకు విచ్చేయండి.

గోదావ‌రి చిరునామా:

గోదావ‌రి న‌యాగరా
431 3 ఆర్‌డీ స్ట్రీట్‌,
న‌యాగ‌రా ఫాల్స్‌, న్యూయార్క్ 1430.
ఫోన్ః 716-299-0066
ఈమెయిల్: Niagara@godavariUS.com

సంప్ర‌దించండి:
రాజ మున‌గ‌
361-222-4222


మ‌రోమారు మీకు ధ‌న్య‌వాదాలు. మాఆత్మీయ రుచిని మీరు ఆస్వాదిస్తార‌ని భావిస్తున్నాం.

www.GodavariUS.com

Press release by: Indian Clicks, LLC
Tags:    

Similar News

ఇక ఈడీ వంతు