గోదావరి పుష్కరాలకు వెళ్లిన యాత్రికులు పుణ్యం పురుషార్థం అన్నట్లు పర్యాటకానికి కూడా పెద్దపీట వేస్తున్నారు. పనిలో పనిగా నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం ఎలా ఉంటుందో చూసొద్దామని రాజమండ్రి నుంచి నేరుగా అక్కడికి క్యూ కడుతున్నారు. పుష్కరాలకు వెళ్లే సమయంలో కొందరు.. వచ్చే సమయంలో మరికొంతమంది తుళ్లూరు ప్రాంతం నుంచి తమ రూటును మార్చుకుంటున్నారు.
గోదావరి పుష్కరాలకు చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, ప్రకాశం తదితర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున యాత్రికులు వెళుతున్నారు. అలాగే హైదరాబాద్ నుంచి కూడా మరికొంతమంది వెళుతున్నారు. వీరిలో చాలామంది బస్సుల్లోనో కార్లలోనో కూడా వెళుతున్నారు. వీరంతా ఇప్పుడు వెళ్లోటప్పుడో వచ్చేటప్పుడో విజయవాడలో ఆగుతున్నారు. విజయవాడలో కనక దుర్గమ్మ తల్లిని దర్శించుకుంటున్నారు. అక్కడి నుంచి తుళ్లూరు ప్రాంతానికి వెళుతున్నారు. అక్కడ రాజధాని ప్రాంతాన్ని చూస్తున్నారు. పనిలో పనిగా ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమి పూజ చేసిన ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రాంతం పెద్ద పర్యాటక ప్రాంతమైందంటే ఆశ్చర్యం లేదు.
వాస్తవానికి ఆయా జిల్లాల నుంచి ప్రయాణికులు మద్రాసు హైవేపై నేరుగా రాజమండ్రి వెళ్లిపోవచ్చు. కానీ, హైవే నుంచి 20 కిలోమీటర్లు లోపలకు వచ్చి మరీ తుళ్లూరులో భూమి పూజ ప్రాంతాన్ని ఒకసారి కళ్లారా చూస్తున్నారు. దీంతో ఇప్పుడు అమరావతి, తుళ్లూరు, విజయవాడ కనక దుర్గమ్మ దేవాలయాలు భక్తులు, యాత్రికులతో కిటకిటలాడుతున్నాయి.