చరిత్రలో అరుదైన సంఘటన తాజాగా చోటు చేసుకుంది. ఏ మాత్రం సంబంధం లేకుండా పారే గోదారమ్మ.. కృష్ణమ్మలు కలిసిపోయిన ఘటన తాజాగా చోటు చేసుకుంది. పట్టిసీమ ప్రాజెక్టు పుణ్యమా అని తాటిపూడి ప్రాజెక్టు నుంచి గోదావరి నీటిని విడుదల చేశారు. తాటిపూడి నుంచి విడుదల చేసిన 600 క్యూసెక్కుల నీరు పోలవరం కుడికాలువ వద్ద నీటికి స్వాగతం పలికారు.
మరోవైపు కృష్ణమ్మతో కలిసే గోదావర్మకు ఘనంగా స్వాగతం పలకటానికి కృష్ణాజిల్లా పల్లెర్లమూడి వద్ద అక్కడి స్థానికులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మొదటిసారి గోదారమ్మ కృష్ణమ్మతో కలిసే ప్రాంతంలో పూర్ణకుంభంతో నది నీటికి స్వాగతం పలికి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. నదుల అనుసంధానం చేయాలన్న భారీ కలకు తాజా సంగమం తొలి అడుగుగా చెప్పొచ్చు. గోదావరి నుంచి వచ్చిన నీరు.. కృష్ణమ్మలో కలవటం అక్కడి స్థానికులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు.