ప్రపంచవ్యాప్తంగా పొగాకు ఉత్పత్తుల కారణంగా ఏటా కోట్లాది మంది అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే చాలా దేశాలు పొగాకు ఉత్పత్తులను నిలిపివేయాలని ప్రయత్నించినా ఏమాత్రం సాధ్యం కావడం లేదు. ముఖ్యంగా సిగరెట్లకు యువతకు బానిసలవుతుండటం మరింత ఆందోళనను రేకెత్తిస్తోంది.
టీనేజ్ వయసులో సరదాగా మొదలైన అలవాటు క్రమంగా వ్యసనంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయా దేశాలు పొగాకు ఉత్పత్తులపై భారీగా పన్నులు విధిస్తూ వాటిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ పొగాకు ఉత్పత్తుల వాడకం ఏమాత్రం తగ్గుముఖం పట్టకపోవడం గమనార్హం. ఈ క్రమంలో ఆయా దేశాలు కఠిన ఆంక్షలకు దిగుతున్నాయి.
తాజాగా న్యూజిలాండ్ తమ దేశాన్ని 2025 నాటికి స్మోక్ ఫ్రీగా చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే 2009 జనవరి 1 తర్వాత జన్మించిన వారందరికీ ఇకపై సిగరెట్లను అమ్మకూడదనే బిల్లును మంగళవారం తీసుకొచ్చింది. న్యూజిలాండ్ హెరాల్డ్ ప్రకారం స్మోక్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అండ్ రెగ్యులేటెడ్ ప్రొడక్ట్స్ (స్మోక్డ్ టుబాకో) సవరణలో మూడో దశ బిల్లుకు ఆమోదం తెలిపింది.
ఈ కొత్త నిబంధనలు కొత్త ఏడాది నుంచి అమల్లోకి రానున్నట్లు న్యూజిలాండ్ ప్రకటించింది. ది న్యూజిలాండ్ హెరాల్డ్ నివేదిక ప్రకారంగా.. పొగ బెట్టిన పొగాకు ఉత్పత్తుల్లో నికోటిన్ కంటెంట్ తగ్గించడం.. పొగాకు విక్రయించే రిటైలర్ల సంఖ్యను తగ్గించడం.. 2009 జనవరి 1 తర్వాత జన్మించిన వారందరికీ పొగాకు విక్రయించకుండా మూడు సవరణలను చేశారు.
న్యూజిలాండ్ లో ప్రస్తుతం 6వేల సిగరెట్ల దుకాణాలు ఉండగా బిల్లు ఆమోదంతో వీటిలో పది శాతం మాత్రమే ఇకపై నడువనున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా కేవలం 600 దుకాణాల్లో మాత్రమే సిగరెట్లను విక్రయించనున్నారు. కొత్త ఏడాది నుంచి ఈ ప్రక్రియ అమలు కానుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ లో 8 శాతం మాత్రమే ధూమపానం చేస్తున్నారు.
ఏడాదిన్నర క్రితం ఈ సంఖ్య 9.4శాతం ఉండేది. గత పదేళ్లలో న్యూజిలాండ్ లో ధూమపానం చేసే వారి సంఖ్య 50 శాతానికి పైగా తగ్గింది. ఆ దేశం పొగాకు ఉత్పత్తులపై కఠిన చర్యలు తీసుకుండటంతో వీటి వినియోగం క్రమంగా తగ్గుతుంది. ఈ క్రమంలోనే 2025 నాటికి న్యూజిలాండ్ ను స్మోకింగ్ ఫ్రీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వాటి వినియోగంపై సంచలన నిర్ణయాలను తీసుకుంటోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.