ఒమిక్రాన్ వేరియంట్.. సింగపూర్ టూ భారత్ ప్రయాణీకులకు గుడ్ న్యూస్
కరోనా మహమ్మారి దాదాపుగా రెండేళ్ల నుంచి వణికిస్తోంది. మధ్యమధ్యలో గ్యాప్ ఇస్తూ పంజా విసురుతోంది. వైరస్ రూపాంతరం చెందుతూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. భారత్ లో సెకండ్ వేరియంట్ తర్వాత పరిస్థితి కాస్త సద్దుమణిగింది అనుకునేలోపే మళ్లీ ఒమిక్రాన్ పేరిట కోరలు చాస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ ప్రయాణాలపై మళ్లీ ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో ప్రయాణీకులు ఆందోళనకు గురవుతుండగా... కేంద్రం వారికి ఓ తీపి కబురును అందించింది.
సౌత్ ఆఫ్రికాలో పుట్టిన ఒమిక్రాన్ వేరియంట్ కు అతివేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాగా దీనిపై ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. అందులో భాగంగానే భారత్ దేశం ముందస్తు చర్యలు చేపట్టింది. కొత్త వేరియంట్ ను ప్రభావవంతంగా ఎదుర్కొవాలని కసరత్తు చేస్తోంది.
అందుకే ఒమిక్రాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల జాబితాను అట్ రిస్క్ పేరిట కేంద్రప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. అందులో పేర్కొన్న దేశాలకు వెళ్లాలంటే కొన్ని కఠిన నిబంధనలను విధించింది. కరోనా పరీక్షలతో పాటు క్వారంటైన్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
కేంద్ర తయారు చేసిన అట్ రిస్క్ జాబితాలో తొలుత సింగపూర్, ఇజ్రాయెల్, జింబాబ్వే, న్యూజిలాండ్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, యూకే, ఇజ్రాయిన్, హాంగ్ కాంగ్ దేశాలు ఉన్నాయి. ఈ దేశాల ప్రయాణాలకు కఠిన నిబంధనలు వర్తిస్తాయి. అయితే తాజాగా ఈ జాబితాను కేంద్రం సవరించింది. అందులో భాగంగా సింగపూర్ పేరును తొలగించింది. అంతేకాకుండా కొత్తగా టాంజానియా, ఘనా దేశాలను చేర్చింది.
కేంద్రప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో అంతర్జాతీయ ప్రయాణికులకు ఊరట లభించింది. కరోనా మూడో వేవ్ హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో సింగపూర్ నుంచి భారత్ రావాలనుకున్న ప్రయాణీకులకు తీపి కబురు అందింది. అయితే వీరికి విమానాశ్రయంలో కొవిడ్ పరీక్షలు నిర్వహించిన అనంతరం అనుమతిస్తున్నారు.