ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సింగరేణి బొగ్గు కార్మికులకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుభవార్త చెప్పారు. ఇంత అకస్మాత్తుగా, సీఎం వాళ్లపై వరాల జల్లు కురిపించడానికి కారణం త్వరలో రానున్న ఎన్నికలేనా అనే ప్రచారం మొదలైంది. తెలంగాణ తో పాటు దక్షిణ భారత దేశానికి వెలుగులు నింపుతున్న సింగరేణి లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎంతో కాలంగా వాయిదా పడ్డ సింగరేణి ఎన్నికలు త్వరలో జరగనుండటంతో ఈ ఎన్నికలకు టీఆర్ ఎస్ సిద్ధం అవుతోంది. గతంలో కేసీఆర్ సింగరేణి కార్మికులకు అనేక హామీలిచ్చారు. కానీ, ఆ హామీల అమలు విషయంలో మాత్రం కొంతమేర నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారు.
దీనితో తెలంగాణ ప్రభుత్వంపై ఇప్పటికే సింగరేణి కార్మికులు అసంతృప్తితోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బొగ్గు కార్మికులపై వరాల జల్లు కురిపించింది. సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 26వ తేదీన జరిగే బోర్డు సమావేశంలో అమలు తేదీని నిర్ణయించి ప్రకటించాలని సింగరేణి ఎండీ శ్రీధర్‌కు సీఎం ఆదేశించారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, కోల్‌బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు ఈ మేరకు పదవీ విరమణ వయసు పెంపు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో మొత్తం 43,899 మంది సింగరేణి కార్మికులు అధికారులకు లబ్ధి చేకూరనుంది. ఈ మేరకు ఈనెల 26న జరిగే బోర్డు మీటింగ్‌లో అమలు తేదీని నిర్ణయించి ప్రకటించాలని సింగరేణి ఎండీ శ్రీధర్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
దీంతోపాటు రామగుండంలో సింగరేణి వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. వీటికి సంబంధించి త్వరలో ఆదేశాలు వెలువడనున్నాయి. ‘సింగరేణి ప్రాంత సమస్యలు- పరిష్కారాలు’ అంశంపై ఆ ప్రాంత పరిధిలోని ప్రజాప్రతినిధులతో మంగళవారం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో సమీక్ష చేసిన అనంతరం పలు అంశాలపై చర్చించారు. సింగరేణి కార్మికుల సమస్యలతో పాటు ఆ ప్రాంత పరిధిలోని సమస్యలపైనా మంత్రులు, ఉన్నతాధికారులతో చర్చించారు. ఆయా నియోజకవర్గాల్లోని జా సమస్యలను మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సింగరేణి పరిధిలో బాధితులకు ఇండ్ల స్థలాలను సింగరేణి సంస్థ కేటాయించి కలెక్టర్లకు అప్పగించిందని వాటిని సత్వరమే పంపిణీ చేయాలని ఎమ్మెల్యేలు చేసిన అభ్యర్థనకు సీఎం కేసీఆర్ స్పందించారు. దాదాపు 30 వేల మందికి లబ్ధి చేకూర్చే అంశాన్ని ఆలస్యం చేయకుండా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.