అక్టోబరులో జీఎస్టీ బాదుడు లెక్క తెలిస్తే నోట మాట రాదంతే

Update: 2022-11-02 04:39 GMT
ఐస్ క్రీమ్ తినటం విలాసమా? అవుననే అనుకుందాం. హోటల్ కు వెళ్లి ఆకలి తీర్చుకోవటానికి రెండు ఇడ్లీ తినటానికి కూడా పన్ను చెల్లించాలా? అంటే అవునని చెబుతుంది జీఎస్టీ. ఒక దేశం.. ఒకే పన్ను పేరుతో తెర మీదకు తీసుకొచ్చిన జీఎస్టీ పోటు.. దేశ ప్రజలకు ఎంత భారం అన్న విషయం తాజాగా బయటకు వచ్చిన గణాంకాల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. జీఎస్టీని తీసకొచ్చిన నాటితో పోలిస్తే.. నేటికి దాని కిందకు తీసుకొచ్చిన వస్తు సేవలు అంతకంతకూ పెరిగిపోతోంది. దానికి తగ్గట్లే.. ప్రజల మీద భారం పెరుగుతోంది.

ఒక వ్యక్తి తాను సంపాదించే సంపాదనకు ఆదాయపన్నుతో పాటు పడి.. చేతికి వచ్చిన డబ్బుల్ని ఖర్చు పెట్టే ప్రతిచోట ఏదో రూపేణా బాదే పన్ను బాదుడు అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఈ తీరు పెరిగే కొద్దీ.. ప్రభుత్వానికి ఆదాయం అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

తాజాగా ముగిసిన అక్టోబరు నెలలు దేశ ప్రజల నుంచి జీఎస్టీ పేరుతో లాగేసిన మొత్తం ఎంతో తెలుసా? అక్షరాల రూ.1.52 లక్షల కోట్లు. ఇంత భారీగా కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం ఎలా వచ్చిందన్నది చూస్తే.. రెండు పండుగలు ఒకే నెలలో రావటంగా చెప్పక తప్పదు.

ఈ ఏడాది జీఎస్టీ పేరుతో ప్రభుత్వాలకు వస్తున్న ఆదాయం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ లో రికార్డు వసూళ్లు వచ్చిన తర్వాత.. మళ్లీ ఆ స్థాయిలో పన్ను వసూళ్లు వచ్చింది ఇప్పుడే. ఏప్రిల్ లో జీఎస్గీ కరింద వచ్చిన ఆదాయం రూ.1.68 లక్షల కోట్లు.

తాజాగా ముగిసిన అక్టోబరులో రూ.1.52 లక్షల కోట్ల ఆదాయం లభించింది. ఆసక్తికరమైన మరో విషయం ఏమంటే.. 2022 సెప్టెంబరు నెలలో 8.3 కోట్ల ఈ - వే బిల్లులు జనరేట్ కాగా.. 2022 అక్టోబరులో 7.7 కోట్ల  ఈ- వే బిల్లులు మాత్రమే జనరేట్ అయ్యాయి. కానీ.. పన్ను ఆదాయం మాత్రం అక్టోబరు నెలలోనే ఎక్కువగా ఉండటం విశేషం.

గడిచిన పది నెలల జీఎస్టీ ఆదాయాన్ని సరాసరి చేసి చూసినప్పుడు రూ.1.45 లక్షలకు తగ్గని పరిస్థితి. మొత్తం పది నెలల్లో అత్యధిక ఆదాయం వచ్చిన రెండు నెలల్ని పక్కన పెట్టి.. మిగిలిన ఎనిమిది నెలల సరాసరి ఆదాయం చేసినా.. ఈ మేర ఉండటం ఆసక్తికరం. జీఎస్టీ వసూళ్ల లెక్క పెరిగే కొద్దీ.. ప్రజల జేబుల నుంచి అంతే భారీగా డబ్బులు పన్ను పోటు కారణంగా పోతున్నాయన్నది మర్చిపోకూడదు. ప్రభుత్వానికి భారీ ఆదాయం రావటం.. దానికి బదులుగా ప్రజల జేబుల మీద భారీగా ప్రభావం పడటం గమనార్హం.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News