సెర్చింజన్ దిగ్గజం గూగుల్ మరో సంచలన ఆవిష్కరణ చేసింది. రోగి ఆరోగ్య పరిస్థితిని - దవాఖానలో ఉండాల్సిన కాలాన్ని - కోలుకొనేందుకు పట్టే సమయాన్ని లేదా మృతి చెందడానికి గల అవకాశాలను అంచనావేయగల పరికరాన్ని గూగుల్ రూపొందించింది.గూగుల్ మే నెలలో ప్రచురించిన ఓ అంశంలో ఆరోగ్య పరిరక్షణలో కృత్రిమ మేధస్సుకు రూపమైన న్యూరల్ నెట్ వర్క్ సాఫ్ట్ వేర్ సామర్థ్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. `రొమ్ము క్యాన్సర్ తో ఓ మహిళ దవాఖానకు వచ్చింది. అప్పటికే ఆమె ఊపిరితిత్తుల నిండా ఔషధ ద్రవాలు ప్రవహిస్తున్నాయి. ఇద్దరు డాక్టర్లు ఆమెను పరీక్షించిన అనంతరం రేడియాలాజీ స్కానింగ్ చేశారు. వైద్య పరీక్షల నివేదిక ప్రకారం - దవాఖానలో చికిత్స పొందుతూ ఆమె మరణించే అవకాశం కేవలం 9.3 శాతం మాత్రమే ఉన్నదని అక్కడి కంప్యూటర్లు అంచనా వేశాయి. అప్పుడు గూగుల్ రంగప్రవేశం చేసింది. గూగుల్ రూపొందించిన ఓ కొత్త యంత్ర పరికరం ఆ మహిళకు సంబంధించిన 1,75,639 డాటా పాయింట్లను అధ్యయనం చేసి - ఆమె మరణించడానికి గల అవకాశాలను 19.9 శాతంగా అంచనా వేసింది. కొద్ది రోజుల్లోనే ఆమె మరణించారు.`` ఇది గూగుల్ పాఠం సారాంశం.
గూగుల్ తన నూతన ఆవిష్కరణ గురించి వివరిస్తూ...రోగికి సంబంధించిన పాత రికార్డులన్నింటినీ ఈ న్యూరల్ నెట్ వర్క్ జల్లెడ పడుతుందని పేర్కొంది. ఆ సమాచారాన్నంతా విశ్లేషించి - ఫలితాన్ని వెల్లడిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పరిజ్ఞానం కన్నా అత్యంత వేగంగా - కచ్చితంగా వివరాలు వెల్లడిస్తుండటం ఆ యంత్రం ప్రత్యేకత. ఏ వైద్య పరీక్షల ఆధారంగా అది సదరు నిర్ధారణకు వచ్చిందో కూడా ఈ గూగుల్ యంత్రం వెల్లడిస్తుంది. అనారోగ్యం బారిన పడిన వారి పాత వైద్య రికార్డులు అందుబాటులో ఉంటే వారిని త్వరగా నయం చేయవచ్చని డాక్టర్లు చెప్తుంటారు.
స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న నిగమ్ షా మరిన్ని వివరాలు వెల్లడిస్తూ ``రోగికి సంబంధించిన ఆరోగ్య పరీక్షల రికార్డులను ఆస్పత్రులు - డాక్టర్లు చివరికి రోగి కూడా తమ వద్ద ఎక్కువకాలం ఉంచుకోరు. కొన్ని ఆస్పత్రుల రికార్డులను దాచి ఉంచేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ అది ఖర్చు - శ్రమతో కూడుకున్న గజిబిజి వ్యవహారంగా మారిపోయింది. గూగుల్ పరికరంలో వివరాలను నమోదు చేసిన తరువాత వాటిని ఓ మూలన పారేసి మీరు నిశ్చింతగా ఉండవచ్చు`` అని పేర్కొన్నారు. ఈ యంత్రాలను త్వరలో క్లినిక్ ల్లో ప్రవేశపెట్టేందుకు గూగుల్ ప్రయత్నిస్తోంది. తాము రూపొందించనున్న తదుపరి కృత్రిమ మేధో పరికరాలు రోగ లక్షణాలను అంచనా వేసి - వ్యాధిని నిర్ధారించేవిగా ఉండగలవని గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చీఫ్ జెఫ్ డీన్ పేర్కొన్నారు.