యాపిల్ కు గూగుల్ సపోర్టు

Update: 2016-02-18 12:04 GMT
ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు సహకరించాలని అమెరికా చేసిన విజ్ఙప్తిని యాపిల్ సంస్థ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. శాన్ బెర్నార్డినోలో 14 మందిని కాల్చిచంపిన ఉగ్రవాది ఫోన్ ను అన్ లాక్ చేసి తమకు సహకరించాలని ఎఫ్ బీఐ కోరగా యాపిల్ సంస్థ నో చెప్పింది. కాగా యాపిల్ తీసుకున్న ఈ నిర్ణయానికి మరో దిగ్గజ సంస్త గూగుల్ సమర్థించింది. ఈ మేరకు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఓ సందేశం పెట్టారు. ఉగ్రవాదం నుంచి ప్రజలను రక్షించేందుకు భద్రతా సంస్థలు నిత్యం శ్రమిస్తాయని తమకు తెలుసని... అయితే వినియోగదారుల సమాచార భద్రతకు తాము తీసుకునే ఎన్నో చర్యలకు గండికొట్టేలా తమను హ్యాకింగ్ చేయాలని కోరడం కరెక్టు కాదని పేర్కొన్నారు.

యాపిల్ అయినా గూగుల్ అయనా వినియోగదారుల సమాచారం పూర్తిగా భద్రంగా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాయి. నిత్యం ఆ దిశగా టెక్నికల్ గా అప్ డేట్ అవుతుంటాయి. కానీ వినియోగదారుల ప్రైవసీ విషయంలో మమ్మల్ని రాజీపఢాలని ప్రభుత్వం కోరుతోంది. దీనివల్ల వినియోగదారులకు మాపై నమ్మకం పోతుంది పిచాయ్ అభిప్రాయపడ్డారు.

అయితే... సమాచారాన్ని భద్రంగా ఉంచే సురక్షితమైన వస్తువులను రూపొందించడమే కాకుండా చట్టపరమైన ఆదేశాల మేరకు డాటా యాక్సెస్ కు అవకాశం కల్పిస్తామని పిచాయ్ చెబుతూ.... కస్టమర్ ఫోన్ ను హ్యాక్ చేయడం మాత్రం సరికాదని... తమను అలా చేయమని కోరడం కూడా కరెక్టు కాదని సుందర్ పిచాయ్ అభిప్రాయపడ్డారు. మొత్తానికి సంస్థల మధ్య ఎలాంటి పోటీ ఉన్నా ఈ విషయంలో మాత్రం అంతా ఒక్కటే అని నిరూపించుకున్నారు.
Tags:    

Similar News