హిందుత్వ పార్టీ అని చెప్పుకుంటూనే హిందూ సంప్రదాయాలను తుంగలో తొక్కేస్తోంది భారతీయ జనతా పార్టీ. అడ్డదిడ్డమైన వ్యాఖ్యానాలతో నలుగురిలో హిందుత్వాన్ని బీజేపీ నేతలు చులకన చేస్తున్నారు. ప్రేమికుల రోజు వస్తే తాళిబొట్లు పట్టుకుని తిరుగుతూ అమాయకులకు దౌర్జన్యంగా పెళ్లిళ్లు చేస్తున్న బీజేపీ అనుబంధ సంస్థలకు మించిన నేతలు ఆ పార్టీలోనే కనిపిస్తున్నారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే అమ్మాయిల గురించి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ తో బీజేపీకి తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి ఉంటే... తాజా మరో మధ్యప్రదేశ్ నేత ఆ పార్టీని ఇరికించారు. కాస్త మంచిగా మాట్లాడితే అమ్మాయిలు సులువుగా పడిపోతారని మధ్యప్రదేశ్ లోని అగర్ మాల్వా నియోజకవర్గ ఎమ్మెల్యే, బీజేపీ లీడర్ గోపాల్ పర్మర్ వ్యాఖ్యానించారు.
ఒకవైపు నిర్ణీత వయస్సులోనే అమ్మాయిలకు వివాహాలు చేయాలని చెప్పిన ఆయన అమ్మాయిలు ఎవరికైనా నాలుగు కబుర్లు చెబితే పడిపోతారు. అందుకే వారిని కట్టడి చేయాలని అన్నారు. అమ్మాయిలు స్వతంత్రులు కాలేరని, వారిపై కంట్రోల్ ఉండటం మంచిదే అంటూ దారుణంగా మాట్లాడారు.
మన ప్రభుత్వాలు అమ్మాయిలకు వివాహ అర్హతను 18 ఏళ్లుగా నిర్ణయించాయి. అది చాలా ఇబ్బంది. తియ్యటి కబుర్లకు పడిపోయే అమ్మాయిలు పెళ్లి వయసు వరకు ఆగడం లేదని అన్నారు. బాల్యవివాహాలు చేయకపోవడం వల్లే... లవ్ జిహాదీ వంటి ఉదంతాలు పెరగడానికి కారణం అన్నట్లు ఆయన మాట్లాడారు. ఆడపిల్లలను తల్లులు ఓ కంట కనిపెట్టాల్సిన అవసరం ఉందని, లవ్ జిహాద్ నుంచి దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత వారిపై ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపాయి.
*తనకు 12 ఏళ్ల వయసులోనే వివాహం జరిగింది. అలాగని బాల్య వివాహాలను నేను ప్రొత్సహించను. 18 ఏళ్లలోపే అమ్మాయిలకు పెళ్లిళ్లు కుదిర్చండి. అప్పుడు వాళ్లకు ఎలాంటి తప్పుడు ఆలోచనలు రావన్నదే నా అభిప్రాయం* అని పర్మర్ వ్యాఖ్యానించడం ఇపుడు పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఆయన వ్యాఖ్యలపై శనివారం సాయంత్రం కొంత మంది విద్యార్థులు భోపాల్ హైవే పై నిరసన తెలుపుతూ ధర్నా చేశారు. పర్మర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ సంఘటనలు అన్నీ చూస్తుంటే... ఏదో ఒక వివాదాన్ని సృష్టించకపోతే బీజేపీకి నిద్ర పట్టే ప్రసక్తే లేదని అర్థమవుతోంది. మహిళలపై హింసను బీజేపీ నేతలు సీరియస్‌గా తీసుకున్న సందర్భాలు చాలా తక్కువ. పైగా రేపిస్టులకు బరితెగించి మద్దతు ఇచ్చిన నేతలను కాశ్మీర్‌లో మంత్రి పదవులతో సత్కరించిన తీరు ఎంతో మంది మానవతావాదులను హర్ట్ చేసింది.