ఈవీఎం లోపాలపై ఏపీ ఈసీ ఏం చెప్పారంటే?

Update: 2019-04-11 10:19 GMT
అనుమానాలు నిజమయ్యాయి. ఈవీఎంలలో సాంకేతిక లోపాలు తలెత్తే అవకాశం ఉందన్న రాజకీయ పార్టీల అనుమానాలు ఉత్తవే అన్నట్లుగా చెప్పిన ఈసీ.. సరిగ్గా పోలింగ్ నాటికి మాత్రం అందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేయటం గమనార్హం.ఏపీలో జరుగుతున్న పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని.. ఓటర్లు తమ ఓటుహక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని విన్నవించింది.

పోలింగ్ కు సంబంధించి పుకార్లను నమ్మొద్దని పేర్కొంది. పోలింగ్ కేంద్రాల దగ్గర ఎక్కువ సంఖ్యలో ఓటర్లు క్యూలైన్లో నిలుచొని ఉన్నారని.. ఈ నేపథ్యంలో ఓట్ల శాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈవీఎంలలో సాంకేతిక లోపాలు తలెత్తినప్పటికీ.. వాటిని ఎన్నికల సిబ్బంది పరిష్కరించినట్లుగా ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ద్వివేది పేర్కొన్నారు.

కనెక్షన్లను సక్రమంగా ఇవ్వకపోవటం వల్ల కొంత ఆలస్యం జరిగిందన్న ఆయన.. ప్రతి ఒకరూ తప్పనిసరిగా ఓటు వేయాలన్న మాటను చెప్పటం గమనార్హం. సాయంత్రం ఆరు గంటల లోపు క్యూలైన్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు వేసే అవకాశం ఇస్తామని ఆయన చెప్పారు.

ఈవీఎంలలో చోటు చేసుకున్న సాంకేతిక సమస్యలపై ఆయన స్పందిస్తూ.. చాలా చోట్ల వాటిని సరిదిద్దినట్లుగా చెప్పారు. ఏపీ వ్యాప్తంగా లోక్ సభ.. అసెంబ్లీ ఎన్నికల కోసం 45,900 ఈవీఎంలు వినియోగిస్తున్నారు. వీటిల్లో కేవలం 362 ఈవీఎంలలో మాత్రమే సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయని.. వాటిల్లో 310 ఈవీఎంలలో తలెత్తిన సమస్యల్ని అప్పటికప్పుడు సరిదిద్దగా.. 52 చోట్ల మాత్రం ఈవీఎంలను మార్చినట్లుగా ఆయన చెబుతున్నారు. ఈసీ మాటల్లో చూస్తే.. సాంకేతిక సమస్య స్వల్పమేనని చెబుతుండగా.. మీడియాలోనూ.. ప్రజల నుంచి మాత్రం అందుకు భిన్నమైన వాదన వినిపిస్తూ ఉండటం గమనార్హం.
Tags:    

Similar News