ఎన్నికలపై సుప్రీం కోర్టు నిర్మాణాత్మక సూచనలు చేసిందని, ఆ ప్రకారం రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా సాగుతాయని ఆశిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. తనకు ఉద్యోగులతో ఏ సమస్యా లేదన్న కమిషనర్.. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సంయమనం పాటించాలని సూచించారు.
రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ను ఎస్‌ఈసీ రమేశ్ కుమార్ కలిసిన విషయం తెలిసిందే. వీరి భేటీ వివరాలను నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మీడియకు తెలిపారు. ప్రభుత్వానికి, ఎస్ఈసీకి వారదిగా ఉంటానని గవర్నర్ హరిచందన్ హామీ ఇచ్చినట్లు రమేశ్ కుమార్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు.
ప్రభుత్వం, ఉద్యోగుల పాత్రపై గవర్నర్ నిర్మాణాత్మక సూచనలు చేశారన్నారు. ఆ సూచనలను సానుకూల దృక్పథంతో స్వీకరించి ఎన్నికలను విజయవంతం చేయాలని భావిస్తున్నామని రమేశ్ కుమార్ చెప్పారు. డీజీపీ గౌతమ్ సవాంగ్, ఆదిత్యానాథ్ దాస్‌తో వ్యక్తిగతంగా తనకు మంచి సంబంధాలున్నాయని చెప్పారు. తాను వారిని సస్పెండ్ చేస్తానని చెప్పలేదని, కేవలం అభిశంసన మాత్రమే చేశానని పేర్కొన్నారు.
"వారి ప్రతిష్టను ఇనుమడింపజేశాను. ఎన్నికలకు ఎలాంటి ఇబ్బందీ లేదు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరిస్తోంది. నేను కూడా ఉద్యోగినే. నాకు ఉద్యోగుల పట్ల వ్యతిరేక భావం లేదు. ప్రభుత్వంపై నా మనసులో ఎలాంటి కక్షా లేదు." అని అన్నారు.ఓటు హక్కు కోసం దుగ్గిరాల వెళ్లానని, తన ఓటు హక్కు సాధించేందుకు ఎంతవరకైనా వెళతానని అన్నారు. కోడ్ ఆప్ కండక్ట్ విషయంలో ప్రభుత్వం పెద్దలు సంయమనం పాటించాలని నిమ్మగడ్డ రమేశ్ సూచించారు.