ఇలా అయితే ముందు జ‌గ‌న్ అర్హ‌త తేల్చాల్సిందే..!

Update: 2022-12-28 12:30 GMT
ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాలు తీవ్ర వివాదాల‌కు కేంద్రంగా మారుతున్నాయి. ఒక‌వైపు పింఛ‌ను పెంచుతున్నామంటూ.. అవ్వాతాత మొముల్లో ఆనందం మొల‌కెత్తించిన ప్ర‌భుత్వం వెంట‌నే.. అన‌ర్హులంటూ.. రాష్ట్ర వ్యాప్తంగా 5 ల‌క్ష‌లకు పైగానే పింఛ‌న్ల‌ను కోత పెట్టేందుకు రెడీ అయింది. దీంతో.. తాజాగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, ఇతర పింఛనుదారుల్లో ఒక్కొక్క రిది ఒక్కో బాధ క‌నిపిస్తోంది.

తప్పుడు తడకల సర్వేను ప్రాతిపదికగా తీసుకుని.. అర్హులను కూడా అనర్హుల జాబితాలోకి చేర్చేస్తున్నార‌నే ది.. వారి వాద‌న‌. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 60 వేల మంది పింఛనుదారులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.

కారు, పొలం లేకున్నా ఉన్నట్లు, 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్తు వినియోగించకున్నా వాడినట్లు.. పొంతన లేని కారణాలతో నోటీసులు జారీ చేసినవే భారీగా ఉన్నాయి.

తాత్కాలికంగా పింఛను నిలిపేశామని, నోటీసు అందుకున్న 15 రోజుల్లో అర్హతను నిరూపించుకోకపోతే శాశ్వ తంగా రద్దు చేస్తామని స్పష్టంగా చెప్పేసింది. అయితే.. ఇప్పుడు దీనిపైనే ప్ర‌జ‌లు తిరుగుబాటు చేస్తున్నా రు.

నాడు ముద్దులు పెట్టి.. హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్న సీఎం జ‌గ‌న్ .. ఇప్పుడు.. ఇలా వ్య‌వ‌హ‌రిం చ‌డం ఏంట‌ని నిల‌దీస్తున్నారు. అంతేకాదు.. త‌మ అర్హ‌త తేల్చ‌డం కంటే కూడా.. జ‌గ‌న్ అర్హ‌త తేలాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు.

మొత్తానికి ఇప్పుడు.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకున్న‌నిర్ణ‌యం.. గ్రామీణ స్థాయిలో తీవ్రస్థాయి వ్య‌తిరేక‌త ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఎందుకంటే.. జీవ‌నాధార‌మైన‌.. పించ‌న్‌పై గ్రామీణ స్థాయిలో సెంటిమెంటు కూడా ఉంది. గ‌తంలో ఎక్కువ‌గా గ్రామీణ ఓటు బ్యాంకే వైసీపీకి క‌లిసి వ‌చ్చింది. ఇప్పుడు అదే ఓటు బ్యాంకు.. వైసీపీపై తిర‌గ‌బ‌డే ఛాన్స్ క‌నిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News