మహిళల ఆర్ధిక ప్రగతి కోసం తమ ప్రభుత్వం టాప్ ప్రయారిటి ఇస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి చెప్పారు. మహిళల ఆర్ధికప్రగతి కోసం ఉద్దశించిన ఆసరా, చేయూత, సున్నా వడ్డీ లాంటి పథకాలను సక్రమంగా అమలు చేయాలని ఉన్నతాధికారులను జగన్ ఆదేశించారు. పై పథకాల అమలుపై జగన్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రిలయన్స్ కు చెందిన అజియో, టనాజెర్, గ్రామీణ వికాస కేంద్ర, మహీంద్ర, గెయిన్, కల్ గుడి లాంటి కంపెనీలతో అవగాహన ఒప్పందాలు చేసుకున్నట్లు చెప్పారు.
గత సంవత్సరం కూడా ఐటీసీ, అమూల్, రిలయన్స్ లాంటి దిగ్గజాలతో చేసుకున్న ఒప్పందాలను వివరించారు. చంద్రబాబు నాయుడు హయాంలో చేసిన నిర్వాకం కారణంగా మహిళా స్వావలంబన పూర్తిగా దెబ్బ తినేసిందని మండిపడ్డారు. బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను చెల్లించద్దని, తాను అధికారంలోకి రాగానే అప్పులన్నింటినీ తానే తీర్చేస్తామని పదే పదే హామీలిచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే మహిళలను మోసం చేసినట్లు ఆరోపించారు.
చంద్రబాబు చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలను నమ్మి బ్యాంకులో రుణాలను కట్టని కారణంగా అందరూ మునిగిపోయారని అన్నారు. వాళ్ళు తీసుకున్న రుణాలకు వడ్డీలు విపరీతంగా పెరిగిపోయిన కారణంగా చివరకు తీర్చలేని పరిస్ధితిలో పడిపోయారని జగన్ వివరించారు. తన పాదయాత్ర సందర్భంగా తనను కలిసిన మహిళలు ప్రధానంగా బ్యాంకు అప్పులు, పెరిగిపోయిన వడ్డీల గురించే వాపోయిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
తాను అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పులన్నింటినీ నాలుగు వాయిదాలుగా క్లియర్ చేస్తున్నట్లు చెప్పారు. మొదట విడత ఆసరా పథకం క్రింద ఇప్పటికి 8 లక్షల డ్వాక్రా గ్రూపులకు రు. 6330 కోట్లు జమ చేసినట్లు జగన్ తెలిపారు. చంద్రబాబు హామీని నమ్మడం వల్లే ఏ గ్రేడులో ఉన్న డ్వాక్రా సంఘాలన్నీ ఒక్కసారిగా సీ గ్రేడులోకి పడిపోయిందని చెప్పారు. తొందరలోనే రెండో విడత నిధులను 2,21,598 మంది మహిళలకు జమ చేయనున్నట్లు చెప్పారు. బ్యాంకుల్లో జమ చేసే నిధులను బ్యాంకులు పాత బకాయిలకు జమ చేసుకోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని గట్టిగా చెప్పారు.