తెలుగు రాష్ర్టాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లారు. ఈ సందర్భంగా గవర్నర్.. అన్నారం - సుందిళ్ల బ్యారేజీలతో పాటు కన్నెపల్లి పంప్ హౌజ్ ను సందర్శించారు. ఆయన వెంట మంత్రి హరీశ్ రావు - ఉన్నతాధికారులు ఉన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన గవర్నర్... కాళేశ్వరం ప్రాజెక్ట్ నభూతో నభవిష్యత్ అన్నట్లుగా ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును చూసిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ను కాళేశ్వరం చంద్రశేఖర్ రావు అని పిలవాలనిపిస్తున్నదని గవర్నర్ ప్రశంసలు గుప్పించారు. హరీశ్‌రావు ఇప్పటి నుంచి కాళేశ్వరరావు అని అన్నారు. `హరీశ్ రావు అడుగు తీసి అడుగేస్తే కాళేశ్వరం తప్ప మరో మాట లేదు. ఆయన దేహమంతా కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో నిండిపోయింది. హరీశ్ రావును కాళేశ్వర్రావు అని పిలిస్తే బాగుంటుంది.` అని ప్రశంసలు గుప్పించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ వెనక పెద్ద టీమ్ వర్క్ ఉందని..గవర్నర్ అన్నారు. ఈ ప్రాజెక్ట్ చాలా గొప్ప ప్రాజెక్ట్ అన్నారు. మరో ఆరు నెలల్లో ప్రాజెక్ట్ పూర్తవుతుందని ఆశిస్తున్నానన్నారు. ప్యాకేజీ -6లో గోదావరిని అంతర్వాహిణిగా తీసుకొచ్చారని గవర్నర్ తెలిపారు. ప్రాజెక్ట్ పనుల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికీ గవర్నర్ అభినందనలు తెలియజేశారు. 'ఇప్పటి వరకు మ్యాపుల ద్వారానే కాళేశ్వం ప్రాజెక్ట్ గురించి తెలుసుకున్నా. క్షేత్రస్థాయి పరిశీలనలో పనులు జరుగుతున్న తీరు ఆశ్చర్యానికి గురి చేసింది. జూన్ - జులై వరకు తొలి దశ పనులు పూర్తవుతాయి. సీఎం కేసీఆర్ - మంత్రి హరీశ్ రావుకు అభినందనలు. కాళేశ్వరం ప్రాజెక్టుతో వ్యవసాయ - పారిశ్రామిక రంగాల అభివృద్ధి జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. తాగునీరు కూడా అందుతుంది' అని గవర్నర్ అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కన్నేపల్లి పంప్ హౌజ్ ను గవర్నర్ సందర్శించారు. అక్కడ జరుగుతున్న పిల్లర్ల పనితీరును ఆయన పరిశీలించారు. మేడిగడ్డ ఆనకట్టను నరసింహన్ విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. ఇప్పటి వరకు జరిగిన ప్రాజెక్టు పనులను గవర్నర్ కు నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. మూడు షిఫ్టుల్లో సిబ్బంది పని చేస్తున్నారని గవర్నర్ కు మంత్రి వివరించారు. అన్నారం బ్యారేజీ పనులను పరిశీలించిన గవర్నర్ నరసింహన్.. అక్కడ నీటి లభ్యత గురించి మంత్రి హరీష్ రావును గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతమైన ప్రాజెక్టు అని కొనియాడారు. సమయం ప్రకారం పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. కార్మికులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారన్న గవర్నర్.. అనుకున్న సమయానికి పనులు పూర్తవుతాయని చెప్పారు. కాళేశ్వరం పనుల పట్ల గవర్నర్ సంతోషం వ్యక్తం చేశారు.