ఇన్నాళ్లు కరోనా సోకగానే 14రోజుల పాటు తగ్గకపోతే 20 రోజులపాటు ఆస్పత్రిలోనే ఉంచి వారికి తగ్గేదాకా ప్రభుత్వం బోలెడంతా ఖర్చు పెట్టి వైద్యం అందించేది. కరోనా తగ్గితే రెండు సార్లు టెస్టులు నిర్వహించి నెగెటివ్ వచ్చిన తర్వాతే ఇంటికి పంపించేది.కానీ ఇప్పుడు కరోనా తీవ్రత దృష్ట్యా లక్షణాలు స్వల్పంగా ఉన్న రోగులకు పదిరోజుల తర్వాత వరుసగా 3 రోజులు జ్వరం రాకపోతే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయవచ్చని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రాలకు సూచించింది.
కరోనా రోగులకు కాస్తంతా తగ్గినా వారిని ఇంటికి పంపించేయాలని కేంద్రం తాజాగా సూచించింది. తీవ్రతను ఆధారంగా చేసుకొని మూడు విభాగాలుగా చేసింది. స్వల్ప - మధ్యస్త - తీవ్రమైన లక్షణాలున్నా వారిగా రోగులను విభజించాలని రాష్ట్రాలకు సూచించింది.
ఇందులో స్వల్ప - మధ్యస్త లక్షణాలున్న వారికి మూడు రోజుల పాటు జ్వరం రాకపోతే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసేయొచ్చు. అయితే కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులను మాత్రం లక్షణాలు పూర్తిగా తగ్గిన తర్వాత నెగెటివ్ వస్తేనే పంపిస్తారు. అదీ హోంక్వారంటైన్ లో ఉంచాలని కేంద్రం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో కరోనా లక్షణాలు తక్కువగా ఉండి.. తట్టుకునే యువకులను 10రోజులకే ఇంటికి వారి ఇంట్లోనే క్వారంటైన్ లో ఉంచి చికిత్స పొందాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్రాలకు వీలు కల్పించింది. తద్వారా రోగులపై పెట్టే ఖర్చును రాష్ట్రాలు తగ్గించుకోగలుగుతాయి. హోం క్వారంటైన్ లో ఉండడం వల్ల రోగులే ఖర్చు భరిస్తారు.