మహారాష్ట్ర రాజకీయం శరవేగంగా మారుతుంది. ప్రభుత్వ ఏర్పాటుకి ఇక మిగిలింది 60 గంటలే కావడంతో రాజకీయాలు ఊపందుకున్నాయి. దీనితో మహా రాజకీయ సంక్షోభానికి నేడు తెర పడే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వ ఏర్పాటుకి బీజేపీ పావులు కడుపుతుండటం తో ఏ క్షణం అయినా కూడా మహారాజకీయానికి తెరపడే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి పదవిపై శివసేన వెన్కక్కి తగ్గకపోవడంతో సీఎం దేవేంద్ర ఫడణవీస్ మంగళవారం రాత్రి ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ వద్దకు వెళ్లారు. నాగ్‌పూర్‌లో ఆయనతో 45 నిమిషాల సేపు ఏకాంతంగా చర్చలు జరిపారు. ఆర్‌ఎస్ఎస్ సీనియర్ నేత భయ్యాజీ జోషీ కూడా ఈ సమావేశం లో ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత జరిగిన అన్ని పరిణామాలపై చర్చలు జరిగినట్టు తెలుస్తోంది.
అలాగే బీజేపీకి చెందిన సీనియర్ నేతల ప్రతినిధి బృందమొకటి శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేతో మంగళవారం రాత్రే సమావేశమైనట్లు సమాచారం. అలాగే చెరో రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిని పంచుకోవాలన్న తమ డిమాండ్‌ను బీజేపీ సానుకూలంగా పరిశీలిస్తోందని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ సంకేతాలనిచ్చారు. కానీ ఈ విషయాన్ని బీజేపీ నేతలెవరూ ధ్రువీకరించలేదు. అలాగే అమిత్ షాతో ఢిల్లీలో చర్చలు జరిపి వచ్చాక ఫడణవీస్.. రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత పాటిల్, సుధీర్ ముంగంటివార్, గిరీష్ మహాజన్.. మొదలైన వారితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
శివసేనతో ఏ అంశంపైనైనా చర్చించేందుకు మేం సిద్ధం. ఒక్క సీఎం పదవిపై తప్ప. ఇంతవరకూ శివసేన నుంచి ఏ ప్రతిపాదనా రాలేదు. దాని కోసం 24 గంటలూ మా వాకిలి తెరిచే ఉంటుంది అని బీజేపీ కీలక చంద్రకాంత్ పాటిల్ చెప్పారు. మరోవైపు బీజేపీతో బంధాన్ని తెంచుకుని పూర్తిగా బయటకు వస్తేనే ప్రభుత్వ ఏర్పాటుపై చర్చింగలమని ఎన్‌సీపీ నేత శరద్ పవార్ శివసేన నాయకత్వానికి స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకి సమయం కూడా చాలా తక్కువగా ఉండటంతో శివసేన బీజేపీ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికే మొగ్గు చూపుతుందనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.