ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నట్లుగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే... అమెరికా - మెక్సికో మధ్య గోడ నిర్మాణాన్ని ప్రారంభించేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని మెక్సికోనే భరిస్తుందని ప్రకటించారు. దీనిపై ఆ దేశాధ్యక్షుడు ఎన్రికో పెనా నీటో మండిపడ్డారు. ఖర్చును భరించే ప్రసక్తే లేదన్నారు. మొత్తానికి ఇరుదేశాల మధ్య ఈ అంశం ఓ పెద్ద అగాధాన్ని సృష్టించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో... ప్రపంచంలో వివిధ దేశాల మధ్య, ఒకే దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య గోడలు - కంచెలు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది ఆసక్తిగా మారింది.
ప్రపంచం మొత్తంగా మొత్తం గోడలు 66 వివిధ దేశాల మధ్య - ప్రాంతాల మధ్య ఉన్నాయని క్యూబెక్ యూనివర్సిటీకి చెందిన ఎలిజబెత్ వ్యాలెట్ జరిపిన పరిశోధనలో వెల్లడయ్యింది. తూర్పు - పశ్చిమ జర్మనీలను విడదీస్తూ బెర్లిన్ లో 1961లో నిర్మించిన గోడను ఇరుదేశాల ప్రజలు 1989లో బద్దలుకొట్టారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సరిహద్దు గోడల్లో కీలకమైన వాటి వివరాలు ఇవి
అమెరికా-మెక్సికో
మెక్సికో నుంచి అమెరికాలోకి అనధికారికంగా తరలివచ్చే ప్రజల్ని - మాదకద్రవ్యాల రవాణాను అడ్డుకోవటానికి ఇరుదేశాల మధ్య సరిహద్దును పటిష్ఠం చేయాలన్న వాదనలు 1990లో బిల్ క్లింటన్ హయాంలో మొదలయ్యాయి. 2006లో సరిహద్దు రక్షణ చట్టాన్ని అమెరికా రూపొందించింది. అనంతరం వెయ్యి కి.మీ.లకుపైగా పొడవైన భారీ కంచెను ఏర్పాటు చేశారు. దీనిస్థానంలో గోడ నిర్మాణానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు.
సైప్రస్ - గ్రీస్
1974లో టర్కీ ఆక్రమణ తర్వాత సైప్రస్ రాజధాని రెండుగా చీలిపోయింది. ఈ మేరకు ఒక గోడను నిర్మించారు. ఈ గోడకు ఓ వైపు టర్కీ ప్రభావిత సైప్రస్ ఉంటే మరొకవైపు గ్రీస్ ప్రభావిత సైప్రస్ ఉంటాయి.
గ్రీస్-టర్కీ
యూరప్ దేశాలకు అనధికారికంగా తరలివచ్చే వలస ప్రజలకు గ్రీస్ ఒక రహదారిగా ఉపయోగపడింది. ఈ నేపథ్యంలో సరిహద్దు వెంబడి 11 కిలోమీటర్ల పొడవైన గోడను 2012లో గ్రీస్ నిర్మించింది.
మొరాకో-పశ్చిమ సహారా
దేశంలో అంతర్యుద్ధం తలెత్తిన నేపథ్యంలో పొలిసారియో తిరుగుబాటుదారుల ఆక్రమణను అడ్డుకోవటానికి పశ్చిమ సహారాలో 2,736 కి.మీ.ల ఇసుక గోడను మొరాకో నిర్మించింది. 1970లలో నిర్మించిన ఈ గోడ ఇరుప్రాంతాలను ఇప్పటికీ విడదీస్తున్నది.
ఉత్తర ఐర్లాండ్
క్యాథలిక్‌లకు, ప్రొటెస్టంట్‌లకు మధ్య ఘర్షణలను నివారించటం కోసం ఆ రెండు వర్గాల ప్రజలు నివసించే ప్రాంతాలను వేరు చేస్తూ ఉత్తర ఐర్లాండ్‌లోని పలుప్రాంతాల్లో గోడలను, కంచెలను నిర్మించారు. వీటిని పీస్‌లైన్స్/పీస్‌వాల్స్ అని పిలుస్తారు.
సౌదీఅరేబియా-ఇరాక్
ఇరాక్‌తో ఉన్న సరిహద్దుల్లో సౌదీఅరేబియా గతంలోనే 23 అడుగుల ఎత్తున ఒక గోడను కట్టింది. అయితే, ఇటీవల ఇస్లామిక్‌స్టేట్ ఉగ్రవాదసంస్థ విస్తరణ నేపథ్యంలో... ఈ గోడను మరింత కట్టుదిట్టంగా మలుస్తూ, ఇరాక్‌తో ఉన్న సరిహద్దు వెంబడి 901 కి.మీ.ల కంచెను ఏర్పాటు చేసింది. నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది.
ఇజ్రాయెల్-వెస్ట్ బ్యాంక్
పాలస్తీనా తీవ్రవాదుల దాడుల నేపథ్యంలో వెస్ట్ బ్యాంక్ లో 2002లో ఇజ్రాయెల్ భారీ ఎత్తున గోడను నిర్మించింది. తీవ్రవాదుల దాడి అన్నది సాకు మాత్రమేనని, అంతర్జాతీయ న్యాయసూత్రాలను కాలరాస్తూ పాలస్తీనా భూభాగాన్ని మరింతగా ఆక్రమించడానికే ఇజ్రాయెల్ ఈ గోడను నిర్మించిదన్న విమర్శలున్నాయి.
స్పెయిన్-మొరాకో
మొరాకో నుంచి అక్రమంగా ఎవరూ రాకుండా ఉండేందుకు స్పెయిన్ తమదేశంలోని తీరప్రాంత నగరాలు సియూటా, మెలిల్లాల చుట్టూ హైటెక్ కంచెలను నిర్మించింది.
హంగరీ-సెర్బియా
పశ్చిమాసియాలో తలెత్తిన సంక్షోభంతో ఆయా దేశాల నుంచి యూరప్‌నకు పెద్ద ఎత్తున జనం పోటెత్తారు. ఈ నేపథ్యంలో హంగరీ... పొరుగునున్న సెర్బియాతో ఉన్న సరిహద్దులో 177 కి.మీ.ల పొడవైన గోడను గతేడాది సెప్టెంబర్ లో నిర్మించింది.
భారత్-బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ నుంచి పెద్ద ఎత్తున జరుగుతున్న అక్రమ వలసలను అడ్డుకోవటానికి 1993 నుంచి ఇరుదేశాల సరిహద్దులో భారత్ కంచెను నిర్మించటం ప్రారంభించింది. ఈ కంచె వల్ల అక్రమ వలసలు కొద్దిమేరకు కట్టడి చేయగలిగారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/