స్విగ్గీ, జొమాటో ఆర్డ‌ర్ల‌పైనా ఇక త‌ప్ప‌నిస‌రి జీఎస్టీ!

Update: 2021-09-18 03:41 GMT
జీఎస్టీ స‌మావేశం అంటే... కొత్త ఆదాయవ‌న‌రుల‌ను వెదుక్కునే మార్గాల అన్వేష‌ణ‌గా మారింది. జీఎస్టీ కౌన్సిల్ స‌మావేశం అంటే.. ఏదో బాదుడు ఉంద‌నే తీరుగా మారింది. ఈ క్ర‌మంలో తాజా స‌మావేశంలో స్విగ్గీ, జొమాటో ఆర్డ‌ర్ల‌పై త‌ప్ప‌నిస‌రి జీఎస్టీ చేశారు. ఇక ఈ యాప్ ల ద్వారా ఏం ఆర్డ‌ర్ చేసినా ఐదు శాతం బాదుడు త‌ప్ప‌నిస‌రిగా మార‌నుంది.

ఇప్ప‌టికే ఈ యాప్ ద్వారా ఫుడ్ డెలివరీపై జీఎస్టీ ఉంది. అయితే అది అన్ని రెస్టారెంట్ల‌కూ ఉండేది కాదు. యాప్ ల ద్వారా ఆర్డ‌ర్ల‌ను తీసుకునే ప‌లు హోట‌ళ్లు జీఎస్టీని యాడ్ చేసేవి. ప్ర‌ముఖ హోట‌ళ్ల నుంచి ఫుడ్ ఆర్డ‌ర్ చేస్తే వాటిపై జీఎస్టీ యాడ్ అయ్యేది. పార్సిళ్ల‌పై, రెస్టారెంట్ కు వెళ్లి భోజ‌నం చేసేట‌ప్పుడు ప‌డే జీఎస్టీ ఈ యాప్ ల ద్వారా ఆర్డ‌ర్ చేసినా ప‌డేది. ఇక చోటామోటా రెస్టారెంట్ల విష‌యంలో మాత్రం ఈ బాదుడు ఉండేది కాదు.

అయితే ఇక ప్ర‌తి ఆర్డ‌ర్ మీదా జీఎస్టీని త‌ప్ప‌నిస‌రి చేశారు. రెస్టారెంట్ తో సంబంధం లేకుండా, ప్ర‌తి ఆర్డ‌ర్ మీదా ఇక బాదుడు ప‌డ‌నుంది. ఐదు శాతం మేర జీఎస్టీ మొత్తాన్ని యాడ్ చేయ‌నున్నారు. స్విగ్గీ, జొమాటో ఆర్డ‌ర్ చేసి తిన్నా.. అది రెస్టారెంట్ కు వెళ్లి తిన‌డంతోనే ప‌రిగ‌ణించ‌నుంది కేంద్ర ప్ర‌భుత్వం. ఆ మేర‌కు జీఎస్టీ చెల్లించుకోవాల్సి త‌ప్పేలా లేదు.

మొత్తానికి కొత్త కొత్త ఆదాయ మార్గాల‌ను అన్వేషించుకోవ‌డంలో త‌మ‌కు తిరుగే లేద‌ని కేంద్రం చాటుకుంటోంది.
Tags:    

Similar News