ఏక రూప పన్ను విధానం జీఎస్టీతో జేబులు గుల్ల చేసుకుంటున్న జనానికి జీఎస్టీ కౌన్సిల్ తాజాగా కొంత ఉపశమనం కల్పించింది. 30 రకాల వస్తువుల జీఎస్టీ ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. వీటిలో పెరుగు పొడి - ఇడ్లీ/దోశ పిండి - చింతపండు - రెయన్ కోట్స్ - రబ్బర్ బ్యాండ్ లు తదితర వస్తువులున్నాయి. ఇక ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) స్టోర్లకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చారు.
జీఎస్టీ నుంచి కొన్నిటికి మినహాయింపు ఇవ్వాలని... కొన్నిటి ధరలు తగ్గించాలని వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థనలు పంపడంతో జీఎస్టీ కౌన్సిల్ వాటిని పరిశీలించింది. శనివారం హైదరాబాద్‌లో అరుణ్ జైట్లీ ఆధ్వర్యంలో 21వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఇవన్నీ చర్చించారు. రాష్ర్టాల అభ్యర్థనల్లో కొన్నిటిని పరిగణనలోకి తీసుకుంటూ ధరలను తగ్గించారు.
అలాగే జీఎస్టీఆర్-1 ఫిల్లింగ్ పొడిగింపు తేదీని అక్టోబరు 10 వరకు జీఎస్టీ కౌన్సిల్ పొడిగించింది. నిజానికి ఈ గడువు ఆదివారంతో ముగియనుండగా మరో నెల రోజులు పొడిగించింది. ఇదంతా కొత్తగా ఉండడంతో ప్రజలు ఇంకా అలవాటు పడలేదని, జీఎస్టీఆర్ పొడిగింపులో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కారణంగానే గడువును పొడిగించినట్టు అధికారులు వెల్లడించారు.