కొడాలి ఖాతాలో మ‌ళ్లీ గుడివాడ‌... గెలిపించేది చంద్ర‌బాబే...!

Update: 2023-02-14 16:00 GMT
టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు కంట్లో న‌లుసుగా మారిన మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నానిని వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓడించి తీరాల‌ని కంక‌ణం క‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించి చంద్ర బాబు మాస్ట‌ర్ ప్లాన్ రెడీ చేసుకున్నార‌ని కూడా కొన్ని వార్త‌లు.. కొన్నాళ్ల కింద‌ట పేలాయి. ఇంకేముంది.. ఈ ద‌ఫా కొడాలి ఇంటికేన‌నే వాద‌న కూడా వినిపించింది. టీడీపీ నాయ‌కులు అయితే.. మీడియా మీటింగులు పెట్టి మ‌రీ.. ఊద‌ర గొట్టారు.

దీంతో వైసీపీ గూటిలోనూ.. ఒకింత ఖంగారు క‌నిపించింది. ఈ క్ర‌మంలోనే నంద‌మూరి కుటుంబం నుంచి ఒకరిని రంగంలోకి దింపుతార‌ని.. లేదా.. ఈ సీటును జ‌న‌సేన‌తో పొత్తుఉంటే.. దానికి వ‌దిలేస్తార‌ని.. ఏకం గా ప‌వ‌నే ఇక్క‌డ నుంచి పోటీ చేస్తార‌నికూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. రోజులు గ‌డిచే కొద్దీ.. టీడీపీలో ఈ ప‌ట్టు పోతోంది. గ‌తంలో ఉన్న ప‌ట్టుద‌ల‌.. పౌరుషం ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. పైగా.. లైట్ తీసుకుం టున్నారు.

రోజు రోజుకు పెరుగుతున్న స‌మ‌స్య‌ల కార‌ణంగానో.. వ్యూహాల కార‌ణంగానో.. గుడివాడ‌పై మ‌ళ్లీ టీడీపీ ప‌రిస్థితి ప‌ల‌చ‌న అయిపోయింది. పైగా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోత‌న‌కే టికెట్ ఇస్తామ‌ని ..చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు.. మాజీ ఎమ్మెల్యే రావి వెంక‌టేశ్వ‌ర‌రావు ప్ర‌క‌టించారు. దీంతో మొత్తానికి కేడ‌ర్ నీరు గారి పోయింది. రావి ఇక్క‌డ నుంచి పోటీ చేయ‌డం అంటే.. ఏరికోరి.. కొడాలిని మ‌రోసారి గెలిపించ‌డ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు కూడా!.

ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. కొడాలి వంటి బ‌ల‌మైన నాయ‌కుడిని ఎదుర్కొనే విష‌యం లో చంద్ర‌బాబు త‌డ‌బ‌డుతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. కొన్నాళ్లు నందమూరి అని.. మ‌రికొ న్నాళ్లకు వేరేవారికి అని.. వ్యాపార వేత్త అని, ఎన్నారై అని ఇలా.. ఇస్తున్న లీకుల కార‌ణంగా.. పార్టీ బ‌ల‌హీన ప‌డుతోంద‌ని చెబుతున్నారు. పైగా ఇప్పుడు రావి ప్ర‌క‌టించ‌డం.. దీనిని పార్టీ అగ్ర‌నాయ‌క‌త్వం ఎక్క‌డా ఖండించ‌క‌పోవ‌డం వంటివి కూడా చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. మ‌రి ఏం చేస్తారో చూడాలి.
 


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News