ప‌్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పొకెమాన్ గో గేమ్ పై చెలరేగుతున్న వివాదంలో కొత్త కోణం తెరమీదకు వచ్చింది. వివిధ దేశాల్లో ఇప్పటికే పొకెమాన్ పై రభస జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ గేమ్ పై మొట్టమొదటిసారిగా భారత్ లో కోర్టును ఆశ్రయించారు. హిందు - జైన మతస్థుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్న ఈ గేమ్ ను నిషేధించాలని కోరుతూ గుజరాత్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. పిటిషన్ స్వీకరించిన న్యాయస్థానం ఈ మేరకు దీనిపై స్పందించాల్సిందిగా పొకెమాన్ గో తయారీదారుతోపాటు కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
పొకెమాన్ గేమ్ లో ఉండే గుడ్ల లొకేషన్లు మందిరాల్లో ఉన్నట్లుగా మొబైల్ ఫోన్లలో చూపిస్తున్నాయని, ఇది హిందు - జైన మతస్థుల మనోభావాలను దెబ్బతీసినట్లు అవుతుందని పిటిషనర్ తరఫు న్యాయవాది అనిల్ దవే వాదించారు. ఈ గేమ్ లో ఎగ్స్ రూపంలో పాయింట్లు వస్తాయని, ఆ ఎగ్స్ చాలా సమయాల్లో వివిధ మతస్థులు ప్రార్థనలు చేసుకొనే ప్రదేశాల్లోనే చూపిస్తున్నాయని ఆయన కోర్టుకు విన్నవించారు. అందువల్ల ఈ గేమ్ ను మన దేశంలో నిషేధించాలని ఆయన కోరారు. దీనిపై స్పందించిన కోర్టు గేమ్ డెవలపర్‌తోపాటు కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా నోటీసులు జారీ చేసింది. ఈ అంశాన్ని డెవలపర్ దగ్గర ప్రస్తావించాలని పిటిషనర్ కు సూచించింది. తదుపరి విచారణ నాలుగు వారాల తర్వాత ఉండొచ్చని అనిల్ దవే తెలిపారు.