మోడీ రాష్ట్రంలో దారుణం

Update: 2016-02-20 10:29 GMT
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ రాష్ట్రంలో విచిత్రం చోటుచేసుకుంది. టెక్నాల‌జీ జ‌పం జపిస్తూ..ట్విట్ట‌ర్‌ - ఫేస్‌ బుక్‌ ల‌ను ఉప‌యోగించ‌డంలో ముందంజ‌లో ఉండే మోడీ డిజిట‌ల్ ఇండియా పేరుతో దుమ్మురేపుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే అందుకు పూర్తి విరుద్ధంగా ఆయ‌న సొంత రాష్ట్రమైన గుజ‌రాత్‌ లో నిర్ణ‌యం తీసుకున్నారు. తాజాగా గుజ‌రాత్‌ లోని మొహ‌సేనా జిల్లాలో పెళ్లికాని అమ్మాయిలు మొబైల్ ఫోన్ వాడ‌టాన్ని నిషేధిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

"అమ్మాయిల‌కు సెల్‌ ఫోన్లు వాడాల్సిన అవ‌స‌రం ఏముంది? ఇంటర్నెట్ అనేది పెద్ద టైం వేస్ట్ వ్య‌వ‌హారం. దీనికంటే చ‌క్క‌గా చ‌దువుకోవ‌డం లేదా ఇంకేదైనా ప‌నులు చేసుకోవ‌డం అనేది ఆడ‌పిల్ల‌ల‌కు ఉప‌యోగప‌డుతుంది. అందుకే మా గ్రామానికి త‌గిన‌ట్లు నిర్ణ‌యం తీసుకున్నాం" అని గ్రామ స‌ర్పంచ్ దేవ్‌ శీ వంక‌ర్ ప్ర‌క‌టిస్తూ ఈ నిర్ణ‌యం గురించి ఘంటాప‌థంగా చెప్పేశారు. ఈ నిర్ణ‌యం ప్ర‌కారం సెల్‌ ఫోన్‌ ను ఉప‌యోగించిన వారికి 2100 జ‌రిమాన వేయ‌నున్నారు. ఇంతేకాకుండా అలా ఉప‌యోగించిన వారి స‌మాచారం ఇస్తే రూ.200 రివార్డుగా ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కాఫ్ పంచాయ‌తీల  త‌ర‌హాలో జ‌రిపిన పంచాయ‌తీలో ఈమేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్ర రాజ‌ధాని అహ్మ‌దాబాద్‌ కు 100 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న సూర‌జ్ గ్రామంలో ఈ మేర‌కు డిసైడ్ చేసేశారు.

2,500 మంది జ‌నాభా ఉన్న‌ వంక‌ర్ గ్రామంలో వివిధ కులాల‌కు చెందిన వారు ఉన్నారు. ఠాకూర్ కులాల‌కు చెందిన వారు ఎక్కువ సంఖ్య‌లో ఉన్న నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న నేప‌థ్యంలో అందుకు ప‌లువురు బీసీలు సైతం మ‌ద్ద‌తిచ్చారు. దీంతో సెల్‌ఫోన్ బ్యాన్ చేయాల‌నే నిర్ణయం తీసుకొని వారం దాటిపోయినప్ప‌టికీ ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. గుజ‌రాత్‌ కు చెందిన ఠాకూర్‌ లు త‌మ గ్రామాల‌ను బాగు చేసుకునేందుకు అనేక ఆస‌క్తిక‌ర‌మైన‌ నిర్ణ‌యాలు తీసుకుంటారు. పురుషులు మ‌ద్యం తాగ‌డం వ‌ల్లే చెడిపోతున్నార‌ని పేర్కొంటూ మ‌ద్య‌నిషేధాన్ని విధించారు. అనంత‌రం మ‌హిళ‌ల్లో కూడా మార్పు తీసుకువ‌చ్చేందుకు సెల్‌ఫోన్ల‌పై నిషేధం విధిస్తూ తాజాగా నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. గ‌తంలో గుజ‌రాత్‌ కే చెంద‌ని బ‌న‌స్కంత జిల్లాకు చెందిన గ్రామంలో ఈ బ్యాన్‌ ను మొద‌ట‌గా విధించారు. ఈ నేప‌థ్యంలో తాజాగా రెండో జిల్లాలో అమ‌ల్లోకి తీసుకువ‌చ్చారు .
Tags:    

Similar News