మోడీ పరువు తీయబోతున్న గుజరాత్ మహిళలు

Update: 2022-06-20 05:25 GMT
వైబ్రంట్ గుజరాత్..ఒకపుడు యావత్ దేశంలో గుజరాత్ రాష్ట్రం అభివృద్ధిని చాటిచెప్పిన ప్రకటన. ఆ ప్రకటనతోనే గుజరాత్ సీఎంగా నరేంద్రమోడి దేశంలో బాగా పాపులరయ్యారు. వైబ్రంట్ గుజరాత్ ప్రకటనలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, జరిగిన అభివృద్ధిని ప్రముఖ సినీనటుడు అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యలతో హోరెత్తించారు. దానివల్ల ఏమందంటే తమ రాష్ట్రనికి కూడా నరేంద్రమోడి లాంటి నేత ముఖ్యమంత్రిగా ఉండాలని జనాలు కోరుకున్నారు.

ఈ ప్రకటనలు చూసిన జనాలు తమ రాష్ట్రాలు కూడా  గుజరాత్ స్ధాయికి చేరుకుంటాయా అనే ఆలోచన చేశారు. వివిధ రాష్ట్రాల నుండి గుజరాత్ కు సెలబ్రిటీలను పిలిపించి అడ్వర్టైజ్ చేసుకున్నారు.

దాంతో గుజరాత్ ఖ్యాతి యావత్ దేశానికి బాగా పాకిపోయింది. ముఖ్యమంత్రి అంటే మోడీలాగే ఉండాలనేట్లుగా జనాల్లో చర్చలు మొదలయ్యాయి. 2014లో మోడీయే ప్రధానమంత్రి అభ్యర్ధిగా ప్రచారమయ్యేసరికి ఇంకేముంది జనాలంతో పోలోమంటు పరుగులుపెట్టి బీజేపీకి ఓట్లేశారు.

సీన్ కట్ చేస్తే ఇపుడు గుజరాత్ లోని డొల్లతనం బయటపడుతోంది. గుజరాత్ లోని మూడు నాలుగు నగరాలు తప్ప మిగిలిన ప్రాంతమంతా అభివృద్ధికి ఆమడదూరంలోనే ఉందని అర్ధమైపోయింది. వైబ్రంట్ గుజరాత్ ప్రకటనంతా అబద్ధమని తాజాగా మరోసారి బయటపడింది. విషయం ఏమిటంటే గుజరాత్ లో తాగునీరులేని గ్రామాలు వేలల్లో ఉన్నాయట. ఇందులో భాగంగానే గుజరాత్ లోని 50 వేలమంది మహిళలు మోడికి ఒక లేఖ రాశారు. తమ గ్రామాల్లో మంచినీటికి పడుతున్న ఇబ్బందులను లేఖల్లో వివరించారు.

వడ్గావ్ నియోజకవర్గంలోని వేలాదిమంది మహిళలు మంచినీటికోసం అల్లాడిపోతున్నట్లు చెప్పారు. దశాబ్దాల నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. నర్మదానది నుండి నీటిని లిఫ్ట్ చేసి తమ నియోజకవర్గంలోని చెరువులకు నీటిని అందించే పథకాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రు. 500 కోట్లతో పూర్తయ్యే పథకాన్ని బీజేపీ ప్రభుత్వం దశాబ్దాలుగా పట్టించుకోవటంలేదని మండిపోయారు.

వెంటనే నియోజకవర్గంలోని 125 గ్రామాల మంచినీటి సమస్య తీర్చకపోతే గుజరాత్ పరిస్ధితిని కళ్ళకు కట్టేట్లుగా దేశవ్యాప్తంగా  పర్యటనలు చేస్తామని మహిళలు హెచ్చరించారు. ఈ మహిళల స్పూర్తితో రాష్ట్రంలోని మిగిలిన మహిళలు కూడా మోడీకి లేఖలు రాసేందుకు రెడీ అయిపోతున్నారు. వీళ్ళదెబ్బకు మోడీ పరువంతా పోయేట్లుంది.
Tags:    

Similar News