ఓ యువతి ఓ యువకుడిని ఓ ఫంక్షన్ లో చూసింది. మనస్సు పడింది. ప్రేమించి పెళ్లాడింది. తర్వాత అతడు తనకు వరుసకు సోదరడవుతాడని తెలిసి ఇప్పుడు విడాకులు కావాలంటోంది. గుజరాత్ లో జరిగిన ఈ వింత వెడ్డింగ్ వివరాలు ఇలా ఉన్నాయి. గుజరాత్ లోని అంబవడికి చెందిన ఓ యువతికి వివాహ వేడుకలో పస్ర్టాల్ కు చెందిన ఓ యువకుడు పరిచయం అయ్యాడు. తర్వాత వీరిద్దరి మధ్య వలపు తీవ్రత పెరగడంతో పెళ్లి చేసుకోవాలని డిసైడయ్యారు. అయితే ఆ యువతి తన ఫ్యామిలీ సభ్యులు వేరే యువకుడితో వివాహం చేస్తారన్న భయంతో అతడిని రహస్య వివాహం చేసుకుంది.
తర్వాత ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో ఆమెకు తన భర్త వరుసకు సోదరుడు అవుతాడని తెలిసింది. దీంతో పెద్ద తప్పిదం జరిగిపోయిందే అని! షాక్ తిన్న ఆమె ఇప్పుడు తనకు విడాకులు కావాలంటోంది. ఇద్దరూ వెళ్లి మహిళా పోలీస్ స్టేషన్ లో అసలు విషయం చెప్పారు. దీంతో ఏం చేయాలో తలలు పట్టుకున్న పోలీసులు వారికి నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించాలని డిసైడయ్యారు. అయితే ఆమె మాత్రం తన భర్తనుంచి తనకు విడాకులు కావాలంటూ పట్టుబడుతోంది. అతడు మాత్రం బేల చూపులు చూస్తూ ఆమె చెప్పిన దానికి ఊ కొడుతున్నాడట.