నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని ఎర వేసేందుకు ముగ్గురు మధ్యవర్తుల్ని బీజేపీ నియమించి.. అందులో భాగంగా చేసిన ప్రయత్నంపై జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో బీజేపీ రియాక్టు అయ్యింది.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై నమోదైన కేసును సీబీఐ లేదంటే ప్రత్యేక దర్యాప్తు టీం (సిట్)తో విచారణ జరిపేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. తమను అప్రతిష్ట పాలు చేసేందుకు అధికార టీఆర్ఎస్ పన్నిన కుట్రగా ఆ పార్టీకి చెందిన నేతలు పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఏం చేసైనా మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవటమే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం కేసీఆర్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వారు ఆరోపిస్తున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇందులో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.. డీజీపీ.. సైబరాబాద్ సీపీ.. రాజేంద్రనగర్ ఏసీపీ.. మొయినాబాద్ స్టేషన్ హౌస్ ఆఫీసర్.. కేంద్ర హోంశాఖ కార్యదర్శి.. సీబీఐ.. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
ఈ పిటిషన్ పై విచారణ ఈ రోజు (శుక్రవారం) జరిగే వీలుందని చెబుతున్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో రాష్ట్ర అధికారులు పక్షపాతంతో.. అన్యాయంగా విచారణ సాగిస్తున్నట్లుగా పేర్కొన్నారు.
కావాలనే బీజేపీపై నింద మోపుతూ అప్రతిష్టపాలు చేస్తున్నారని ఆరోపించారు. మరి.. ఈ పిటిషన్ పై హైకోర్టు ఏ విధంగా రియాక్టు అవుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.