అమెరికాలో గన్ కల్చర్ రోజురోజుకి పెరిగిపోతుంది. తాజాగా అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓ సూపర్ మార్కెట్ లో కాల్పులు కలకలం రేపాయి. గుర్తు తెలియని ఓ దుండగుడు ఇద్దరు వ్యక్తులను కాల్చిచంపి, తనను తాను కాల్చుకుని కన్నుమూశాడు. రాయల్ పామ్ బీచ్ లోని పబ్లిక్స్ సూపర్ మార్కెట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. దక్షిణ ఫ్లోరిడాలోని దుకాణంలో జరిగిన కాల్పుల ఘటనలో చిన్నారితో సహా ముగ్గురు మృతి చెందారు.
ఉత్తర మియామీకి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయల్ పామ్ బీచ్ వద్ద ఉన్న పబ్లిక్స్ గ్రాసరీ స్టోర్లో గురువారం కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. సమాచారం తెలియగానే పోలీసులు అక్కడకు చేరుకోగా ,ముగ్గురు బుల్లెట్ గాయాలతో మృతి చెంది ఉన్నారని చెప్పారు. వీరిలో షూటర్ కూడా ఉన్నట్లు తెలిపారు. మరో మహిళతో పాటు చిన్నారి చనిపోయారని చెప్పారు. అయితే కాల్పులు ఎందుకు చోటుచేసుకున్నాయో షెరీఫ్ కార్యాలయం వెల్లడించలేదు. కాగా, ఫ్లోరిడాలో ఈ వారంలో ఇది రెండో సంఘటన. ఆదివారం మియామీలోని ఓ పార్టీలో కాల్పులు జరిగి ముగ్గురు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. అయితే కాల్పులు జరిపిన వ్యక్తి, మృతులు పరస్పరం తెలిసిన వ్యక్తులేనని పోలీసులు భావిస్తున్నారు.