దుగ్గొండి ఎంపీడీఓ గుంటి పల్లవి ఐడియాకు ఫిదా కావాల్సిందే!

Update: 2020-01-04 04:45 GMT
వినూత్నంగా ఆలోచించటం అందరికి సాధ్యమయ్యే పని కాదు. సమస్యల్నే పరిష్కారంగా మార్చటం అందరికి చేతనయ్యే పని కాదు. తాజాగా ఆ పని చేసి చూపించి శభాష్ అనటమే కాదు.. ఎంతోమందికి సరికొత్త స్ఫూర్తినిస్తున్నారు దుగ్గొండి ఎండీవో గుంటి పల్లవి. సాధారణంగా రాజకీయ నేతల ఐడియాలకు శభాష్ అనే పరిస్థితి చాలా తక్కువ ఉంటుంది. తాజాగా ఆమె ఆలోచన విన్నంతనే..నిజమే కదా? ఇన్నాళ్లు ఎందుకీ ఆలోచన రాలేదన్న భావన కలగటం ఖాయం.

ఇంతకీ ఆమె ఏం చేశారన్న విషయంలోకి వెళితే.. వరంగల్ రూరల్ మండలమైన దుగ్గొండికి ఎంపీడీవోగా వ్యవహరిస్తున్న ఆమె.. కొబ్బరిబోండాంతో అదిరే ప్లాన్ వేశారు. వీటి కారణంగా దోమలు విపరీతంగా పెరిగిపోయి.. జబ్బులకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. దోమలకు చెక్ చెప్పటమే కాదు.. కొబ్బరి బొండాలను వినూత్నంగా వినియోగించేలా ఆలోచన చేశారు. సాధారణంగా మొక్కలు పెంచేందుకు చిన్న.. చిన్న ప్లాస్టిక్ సంచుల్ని వినియోగించటం తెలిసిందే. కాలుష్యానికి కారణమైన ప్లాస్టిక్ సంచుల స్థానే.. వాడేసిన కొబ్బరి బొండాను వాడేయాలన్నది పల్లవి ఆలోచన.

సాధారణంగా కొబ్బరి బొండాంను భూమిలో పాతి పెడితే మహా అయితే రెండు నెలల్లో మట్టిలో కలిసిపోతుంది. అలాంటప్పుడు బొండాంలో మొక్కను నాటేసి..దాన్ని భూమిలో పాతి పెడితే.. రెండు నెలల్లో భూమిలో కలిసి పోవటమేకాదు.. మొక్క పెద్దయ్యే సమయానికి బొండాం ఎరువుగా మారి.. మరింత బలంగా పెరగటానికి కారణమవుతుంది. ఈ ఐడియాతో ఆమె మొక్కల్ని పెంచుతున్నారు. ఇప్పుడీ విధానాన్ని పలువురు అనుసరించటమే కాదు.. ఖాళీ కొబ్బరిబొండాలతో భలే ప్లాన్ వేశారంటూ పల్లవిని పలువురు ప్రశంసిస్తున్నారు. నిజమే కదూ? కొబ్బంది బొండాంతో భలే ప్లాన్ చేశారు కదా?


Tags:    

Similar News