కూతుళ్లను ఇచ్చి పెళ్లి చేసిన అత్త.. ఆ కూతుళ్ల భర్తలైన అల్లుళ్లతోనే అక్రమ సంబంధం పెట్టుకున్న ఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేసింది. గుంటూరు జిల్లా వెల్ధుర్తి మండలంలోని ఓ గ్రామంలో ఈ యాథార్థ ఘటన చోటుచేసుకుంది.
ఈ గ్రామానికి చెందిన మహిళకు భర్త - ఇద్దరు కూతుళ్లున్నారు. చాలా ఏళ్ల క్రితమే ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి అత్తవారింటికి పంపేసింది. అయితే ఆ కూతుళ్ల భర్తలకే ఎరవేసింది. వారితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తరచూ అల్లుళ్లు ఇంటికి వచ్చి అత్తతో ఎంజాయ్ చేసి వెళ్లడం పరిపాటిగా సాగుతోంది. భర్తకు అనుమానం వచ్చి భార్యను నిలదీశాడు. భార్యను హెచ్చరించాడు. పద్ధతి మార్చుకోవాలని చెప్పినా ఆ మహిళ పట్టించుకోలేదు. ఊళ్లో తెలిసి తన పరువు పోతుందని మథనపడిన భర్త చివరకు ఆ మహిళ తీరుతో విసుగు చెంది ఆత్మహత్య చేసుకున్నాడు..
ఇక భర్త మరణం గురించి తెలిసిన వీరి బంధువు ఆవుల శ్రీనివాస్ కూడా సదురు మహిళను అల్లుళ్లతో అక్రమ సంబంధం మానుకోవాలని.. నీ కూతుళ్ల సంసారాలను నాశనం చేయవద్దని కోరాడు.
ఆవుల శ్రీనివాస్ తన అక్రమ సంబంధానికి అడ్డు అని తెలిసి అతడి హత్యకు ప్లాన్ చేసింది అత్త. తన ఇద్దరు అల్లుళ్లతో కలిసి ఆగస్టు 9న హత్య చేయించింది. మృతుడి భార్య ఆవుల సుగుణమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో అత్తను - అల్లుళ్లను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.
అయితే నిందితుల బంధువులు హత్యకు గురైన ఆవుల శ్రీనివాస్ భార్యపై బెదిరింపులకు పాల్పడ్డారు. ముగ్గురిపై కేసులు వెనక్కి తీసుకోకపోతే చంపేస్తామని బెదిరించారు. దీంతో ఆవుల శ్రీనివాస్ భార్య తాజాగా ఎస్పీని ఆశ్రయించింది. తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరింది. ఇలా అత్త తన సుఖం కోసం అల్లుళ్లతో ఎఫైర్ పెట్టుకొని భర్తతోపాటు మరో బంధువు ప్రాణాలు తీసింది. ఇక చివరకు అల్లుళ్లతో కలిసి జైలు పాలైంది. కూతుళ్ల జీవితాలను నాశనం చేసింది.ఇప్పుడు చంపించిన వ్యక్తి భార్యపై కూడా బెదిరింపులకు దిగడం విస్తుగొలుపుతోంది.