గుంటూరుకు చెందిన ఓ గృహిణి లేటు వయసులో ఎంబీబీఎస్ పూర్తిచేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. అయిదేళ్ల కిందట తన కుమారుడితో కలిసి ఎంబీబీఎస్ లో చేరిన ఆమె ఇప్పుడు తన వైద్య విద్యను పూర్తి చేసి డాక్డరుగా మారారు.
గుంటూరుకు చెందిన ఆర్ ఎంపీ గుంటుపల్లి సాంబశివరావు భార్య లక్ష్మీ సుశీలకు మొదటి నుంచి చదువంటే ఆసక్తి. కానీ... కుటుంబ నిర్వహణలో పడి ఉన్నత చదువులు చదవలేదు. ఆమె ఇద్దరు కుమారులు - పెద్ద కోడలు కూడా డాక్లర్టే. లక్ష్మీ సుశీల కూడా డాక్టరు కావాలనుకున్నారు. దీంతో భర్త - పిల్లలు - కోడలు ఆమెను ప్రోత్సహించారు. మంగళగిరిలోని ఎన్ ఆర్ ఐ మెడికల్ కాలేజీలో డొనేషన్ కట్టి ఆమెను ఎంబీబీఎస్ లో చేర్పించారు. ఆమె అక్కడ వైద్యవిద్యలో చేరినప్పుడే చిన్న కుమారుడు కూడా అక్కడే చేరారు. అలాగే ఆమె పెద్ద కుమారుడు కూడా అంతకుముందు అక్కడే చదువుకున్నారు.
ఓవైపు కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే ఆమె కష్టపడి చదివి ఈ ఏడాది ఎంబీబీఎస్ పాసయ్యారు. చదువుకు వయసు అడ్డం కాదని.. గృహిణులుగా ఉన్నా కూడా ఉన్నత చదువులు చదవొచ్చని ఆమె నిరూపించారు.