సోషల్ మీడియా పుణ్యమా అని చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. చాలా పరిమితమైన సర్కిల్స్ కు మాత్రమే తెలిసిన వారు కూడా ఇప్పుడు పబ్లిక్ ఫిగర్స్ అయిపోతున్నారు. గడిచిన కొన్ని రోజులుగా మోడీకి చెందిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది.
మోడీ పక్కన ఒక మహిళ కూర్చొన్న ఫోటోతో నెటిజన్లు అయోమయానికి గురి అవుతున్నారు. మోడీ పక్కన కనిపించని ఆమె ఎవరు? అన్నది ప్రశ్నగా మారింది. దీనికి తోడు.. విమానంలో ఆయన పక్కన కూర్చున్నట్లుగా ఫోటోను చూస్తే అర్థమవుతుంది. విమానంలో ఆయన పక్క సీట్లో కూర్చునేంత అవకాశం ఎవరికి ఉంటుందన్న సందేహం పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరు? ఏం చేస్తుంటారు? అన్న విషయంలోకి వెళితే.. ఆమె పేరు గురుదీప్ కౌర్.
మోడీ పక్కన ఆమె కూర్చున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది కానీ.. ఆమె అలా ప్రముఖుల సరసన ఉంటారు. ఎందుకంటే.. ఆమె చేసే ఉద్యోగం అలాంటిది. మోడీతో మాత్రమే కాదు.. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా.. పెప్సికో సీఈవో ఇంద్రా నూయిలతో పాటు గురుదీప్ ఫోటో కనిపిస్తుంది. అదెలా అంటే.. ఆమె అనువాదకురాలుగా పని చేస్తుంటారు.
ప్రస్తుతం మోడీ దగ్గర పని చేస్తున్న ఆమె పనేమిటంటే.. విదేశాల్లో మోడీ చేసే హిందీ ప్రసంగాలను ఇంగ్లిషులోకి అనువాదం చేయటం. అనువాదంలో పాతికేళ్ల ఇండస్ట్రీ ఉన్న ఆమె 1990లలో పార్లమెంటులో అనువాదకురాలిగా జాబ్ లో చేరారు. 1996లో జాబ్ వదిలేసి భర్తతో అమెరికాకు వెళ్లిపోయారు. అమెరికా ట్రాన్స్ లేటర్ అసోసియేషన్ మెంబరుగా ఉన్న ఆమె.. విదేశాల్లో మోడీ ప్రసంగాలకు అనువాదకురాలిగా ఉంటారు. వృత్తిరీత్యా మోడీ టీంలో సభ్యురాలైన ఆమె.. మోడీతో కలిసి ఫోటో దిగారని చెప్పాలి.