మోడీని వెంటాడుతున్న స్త్రీ దోషం

Update: 2016-12-23 07:12 GMT
మోడీకి స్త్రీ దోషం ఉందా? ఆయన ఇప్పటికి రెండు గండాల నుంచి బయటపడ్డారా? ఆయనకిప్పుడు మూడో గండం పొంచి ఉందా? ఇంతకీ మూడో గండం ఏమిటి? దాన్నించి బయటపడాలంటే ఏం చేయాలి? మూడోగండం నుంచి మోడీ బయటపడితే ఏం జరుగుతుంది? ఇలాంటి ఆసక్తికరమైన సంగతుల గురించి చెప్పుకొచ్చారు కర్ణాటకకు చెందిన ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మాండ నరేంద్ర శర్మ గురూజీ. తాజాగా ఆయన తమకూరులో మాట్లాడారు. ప్రధాని ఇప్పటివరకూ రెండు పెద్ద గండాల నుంచి విజయవంతంగా బయటపడ్డారని చెప్పారు.

ప్రస్తుతం మోడీని మూడో గండం వెంటాడుతుందన్నారు. 2017 ఫిబ్రవరి లో మూడో గండం ఆయనకుఉందని చెప్పారు. మాఘమాసంలో ముంచుకొచ్చే మూడో గండం ఎలా ఉంటుందో చెప్పలేమన్నారు. అంతేకాదు.. మోడీని స్త్రీ దోష గండం వెంటాడుతున్న విషయాన్ని చెప్పుకొచ్చారు. అఫ్ఘనిస్థాన్ లో ఆయన విమానం ప్రయాణిస్తున్నప్పుడు ప్రతికూల వాతావరణం నుంచి క్షేమంగా బయటపడ్డారని.. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంట జరిగిన పెళ్లికి అకస్మాత్తుగా హాజరై అపకీర్తిని మూటగట్టుకున్న మోడీ.. దాన్నించు క్షేమంగా బయటపడ్డారన్నారు.

తన ప్రమేయం లేకుండా వెళ్లిన మోడీ లేని అపకీర్తిని తెచ్చి పెట్టుకున్నారన్నారు. తాజాగా ప్రధానికి మూడో గండం పొంచి ఉందని.. అదే రూపంలో ఉందన్నది తాను చెప్పలేనన్నారు. ప్రధానికి స్త్రీ దోషం ఉందని.. భార్యకు దూరం కావటం.. తల్లికి దూరంగా ఉండటం లాంటి వాటితో ఆ దోషం నుంచి మోడీ తప్పించుకోలేకపోతున్నారన్నారు. తల్లిని కానీ ఇంటికి తెచ్చి పెట్టుకుంటే.. కొంతలో కొంత దోషం తీరే వీలుందని చెబుతున్నారు. మూడో గండం నుంచి మోడీ క్షేమంగా బయటపడితే.. ఆయనకు మరో 12 ఏళ్లు తిరుగు ఉండదని చెబుతున్నారు. ఇంతకీ.. మోడీ మీద విరుచుకుపడే మూడో గండం ఏమిటో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News