క‌మ‌ల‌నాథుల్లో స‌ర్వేలు పెంచుతున్న అస‌హ‌నం!

Update: 2018-06-11 06:04 GMT
క‌మ‌ల‌నాథుల‌కు కోపం క‌ట్ట‌లు తెంచుకుంటోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కూ త‌మ‌కు తిరుగులేద‌న్న ఆత్మ‌విశ్వాసంతో చెల‌రేగిపోయిన వారికి.. ఇప్పుడు అందుకు భిన్నంగా త‌గులుతున్న ఎదురుదెబ్బ‌ల‌కు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చేతిలో ఉన్న అధికారం చేజారి పోతుంద‌న్న భ‌యాందోళ‌న‌లు వారిలో అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి.

సానుకూల వాతావ‌ర‌ణం కాస్తా ప్ర‌తికూలంగా మారిపోవ‌టం.. ఇదే జ‌రిగితే పార్టీ పుట్టె మునిగిపోతుంద‌న్న భ‌యాందోళ‌న‌లు వారిలో కొత్త కోణాన్ని ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేస్తున్నాయి. త‌మ‌ను విమ‌ర్శించిన వారిని.. త‌ప్పు ప‌ట్టిన వారిపై క‌మ‌ల‌నాథులు క‌స్సు మంటున్నారు. రాజ‌కీయంలో ఉన్న‌ప్పుడు విమ‌ర్శ‌లు.. ప్ర‌తివిమ‌ర్శ‌లు కామ‌న్‌. ఆరోప‌ణ‌లు కూడా మీద ప‌డిపోతుంటాయి. అయితే.. అలాంటి వాటిని క‌మిట్ మెంట్ తో స‌మాధానాలు ఇవ్వాల్సింది పోయి.. వేలెత్తి చూపిన వారి వేళ్లు క‌త్తిరిస్తామ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది.

ప్ర‌ముఖ హిందీ దిన‌ప‌త్రిక లో తాజాగా పబ్లిష్ అయిన స‌ర్వే రిపోర్ట్ పై బీజేపీ నేత‌లు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

ఉత్త‌రాదిన బ‌ల‌మైన మీడియా సంస్థ‌గా.. విలువ‌ల విష‌యంలో ఇప్ప‌టికి మొయింటైన్ చేస్తున్నార‌న్న పేరున్న గ్రూప్ నుంచి వ‌చ్చిన స‌ర్వే క‌థ‌నం పాల‌క ప‌క్షానికి షాకింగ్ గా ఉండ‌టం.. 2014లో బీజేపీ గెలిచిన ఎంపీ స్థానాల్లో స‌గం చోట్ల ఎదురుగాలి వీస్తున్న వైనం అబ‌ద్ధ‌మంటూ బీజేపీ నేత‌లు మండిప‌డుతున్నారు.

ఇక‌.. తెలుగోడైన ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహారావు అయితే ఆవేశాన్ని ఆపుకోలేక‌పోతున్నారు. ఎంత మాట‌.. ఎంత మాట‌.. మోడీనే ధిక్క‌రిస్తారా?  మోడీ పాల‌న బాగోలేదంటారా?  బీజేపీ స‌గం సీట్లు కోల్పోతుందా? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న ఆయ‌న‌.. దైనిక్ భాస్క‌ర్ ప్ర‌చురించిన క‌థ‌నాన్ని తెలుగు మీడియా సంస్థ‌లు ప్ర‌చురించ‌టం ఏమిటంటూ క్వ‌శ్చ‌న్ చేస్తున్నారు.

ఎలాంటి ఆధారాలు లేకుండా ఉద్దేశ‌పూర్వ‌కంగా క‌థ‌నాన్ని ప్ర‌చురించార‌ని.. ఆ ప‌త్రిక‌పైన ప్రెస్ కౌన్సిల్ పైన కంప్లైంట్ చేయ‌నున్న‌ట్లుగా చెప్పారు. జీవీఎల్ లాంటి వారి తీరు చూస్తుంటే.. నిత్యం పొగ‌డాలే కానీ త‌ప్పు ప‌ట్ట‌టం.. విమ‌ర్శించ‌టం లాంటివి చేయ‌కూడ‌ద‌న్న‌ట్లుగా ఉంద‌ని చెప్పాలి. అయినా.. ఒక‌ప్ర‌ముఖ మీడియా సంస్థ తాము జ‌రిపిన స‌ర్వేను తెలుగు మీడియా సంస్థ‌లు ఎలా ప్ర‌చురిస్తాయంటూ ప్ర‌శ్నిస్తున్న వైనం చూస్తే.. మ‌రీ ఇంత అస‌హ‌నం అవ‌స‌ర‌మా? అన్న సందేహం సామాన్యుడిలోపెరిగితే క‌మ‌ల‌నాథుల‌కు కొత్త క‌ష్టాలు త‌ప్ప‌వ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.


Tags:    

Similar News