మూడు రాజధానుల ప్రతిపాదనను టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖలో చంద్రబాబు పర్యటనను విశాఖ వాసులు, వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అని..చంద్రబాబు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు కూడా బాబును వెనక్కు వెళ్లిపోవాలని సూచించడంతో..5 గంటల వితండవాదం అనంతరం చంద్రబాబు...హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు. చంద్రబాబు వెనక్కు వెళ్లడంతో బ్రహ్మాండం బద్దలైపోయినట్లు టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. తమ నేతను అవమానించారంటూ మిన్ను విరిగి మీద పడ్డట్లు ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబుపై పోలీసులు, ప్రభుత్వం అరాచకం చేసినట్లు బిల్డప్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖలో జరిగిన పరిణామాలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సంచనలన వ్యాఖ్యలు చేశారు.
విశాఖలో చంద్రబాబు పర్యటన అడ్డగింతపై జీవీఎల్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబును అడ్డుకోవడాన్ని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారని, అయితే, విశాఖలో జరిగినదానికంటే గతంలో టీడీపీ ఇంకా దారుణంగా వ్యవహరించిందని జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో జగన్ ను విశాఖ ఎయిర్ పోర్టులో అడ్డుకోవడాన్ని పరోక్షంగా ప్రస్తావించిన జీవీఎల్, రాష్ట్రంలోని ఈ తరహా పరిణామాలకు చంద్రబాబే కారకుడని విమర్శించారు. కేంద్రాన్ని, సీబీఐని రాష్ట్రంలో అడుగుపెట్టవద్దని చంద్రబాబు హుకుం జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఏదేమైనా....ఓ నేతపై కోడిగుడ్లతో దాడి చేయడం సరైన సంస్కృతి కాదని జీవీఎల్ అభిప్రాయపడ్డారు. తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డట్లు చంద్రబాబు పరిస్థితి ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో జగన్‌ను విశాఖ ఎయిర్ పోర్టులో అడ్డుకున్న చంద్రబాబు నేడు ప్రశ్నించే హక్కు కోల్పోయారని అంటున్నారు.