అధికారంలో ఉంటూ పెద్ద ఎత్తున అవినీతి పాల్పడుతున్న టీడీపీ నేతలను ప్రజలు క్షమించరని.. బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కు పట్టిన గతే మీకు పడుతుందని టీడీపీ నేతలను హెచ్చరించాడు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. జీవీఎల్ ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీలో 53వేల కోట్లు దారిమళ్లాయని.. టీడీపీ ప్రభుత్వం ఈ సొమ్మును 58వేల పీడీ అకౌంట్లలో వేసిందని జీవీఎల్ సంచలన ఆరోపణలు చేశాడు. ఇది దేశంలోనే అతి పెద్ద కుంభకోణమని వెల్లడించారు.
జీవీఎల్ మాట్లాడుతూ.. ‘కాగ్ నివేదికతో ఈ కుంభకోణం బహిర్గతం అవుతుందని.. కాగ్ కు టీడీపీ నేతలు ఈ విషయాలు తెలియజేయకున్నా.. కాగ్ దృష్టి నుంచి ఈ విషయాన్ని తప్పించలేరని అన్నారు. టీడీపీ నాయకులు అవినీతి దొంగల్లా మాట్లాడుతున్నారని.. తాను అడిగిన ప్రశ్నలకు టీడీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నేను అడిగిన ప్రశ్నలకు షేర్ మార్కెట్ బ్రోకర్ తో సమాధానం చెప్పిస్తున్నారని విమర్శించారు.
53వేల కోట్ల అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేయాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. దీనిపై టీడీపీ నేతలకు ఆయన ఏడు ప్రశ్నలు సంధించారు. పీడీ అకౌంట్స్ లో డబ్బులు ఉండగా ఎందుకు అప్పులు చేస్తున్నారని ప్రశ్నించారు.