ఒక్కొక్కరికి ఒక్కో ఫోబియా ఉంటుందని అంటారు. అయితే రాజకీయ పార్టీలకు కూడా ఫోబియా ఉంటుందా అంటే కచ్చితంగా అంటున్నారు కొందరు నాయకులు. ఇక టీడీపీని విమర్శించే విషయంలో ఏ మాత్రం లెక్కచేయని బీజేపీ నేతల్లో రాజ్య సభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ముందుంటారు. ఆయన తాజాగా మాట్లాడుతూ టీడీపీకి ఎన్నికల భయం పట్టుకుంది అంటున్నారు. ఎన్నికలు అంటే టీడీపీ పారిపోతుందని ఎద్దేవా చేశారు. దానికి ఆయన ఇటీవాల జరిగిన పరిషత్ ఎన్నికల నుంచి బద్వేల్ ఉప ఎన్నికల దాకా కధ చెప్పుకుంటూ వచ్చారు.
ఆయన మాటలు వింటే నిజమే అనిపించకమానదు, పరిషత్ ఎన్నికల్లో ఏనాడో నామినేషన్లు వేసింది టీడీపీ. అంతే కాదు ప్రచారం కూడా చేసింది. తీరా ఎన్నికలకు వరం ముందు మాత్రం మేము బహిష్కరిస్తున్నామని ప్రకటించి తప్పుకుంది. దాని మీద సొంత పార్టీలోనే విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. దాని ఫలితాలను కూడా టీడీపీ చవి చూసింది. అవనీ అలా ఉంచితే ఇపుడు బద్వేల్ ఉప ఎన్నిక విషయంలో కూడా మరో మారు పప్పులో కాలేసింది సైకిల్ పార్టీ అంటున్నారు. అదెల అంటే దాదాపు నెల రోజుల ముందే బద్వేల్ లో పోటీకి తమ అభ్యర్ధిని టీడీపీ ప్రకటించింది. అంతే కాదు, ప్రచారం కూడా చేసుకోమంది.
ఇవన్నీ ఇలా ఉంటే లేటెస్ట్ గా ట్విస్ట్ ఇస్తూ బద్వేల్ లో భర్త చనిపోతే భార్యకు టికెట్ ఇచ్చారు కాబట్టి సానుభూతితో తమ పార్టీ పోటీ నుంచి తప్పుకుంటోందని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. మరి వైసీపీ అభ్యర్ధి గురించి ఎపుడో అందరికీ తెలిస్తే టీడీపీ పెద్దలకు ఇంత ఆలస్యంగా తెలిసిందా అన్నదే ఇక్కడ చర్చ. దీని మీదనే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అయితే సెటైర్లు పేల్చారు. ఓడిపోతామన్న భయంతోనే టీడీపీ ఇలా పారిపోయింది అంటున్నారు. చూడబోతే 2024 ఎన్నికల్లో కూడా టీడీపీ ఇలాగే పోటీ చేయకుండా పారిపోతుందని కూడా ఆయన కౌంటర్లు వేస్తున్నారు.
ఒక విధంగా జీవీఎల్ చేసిన హాట్ కామెంట్స్ టీడీపీని కదిపి కుదిపేవే. ఇది టీడీపీ ప్రతిష్టకు సంబంధించినది కూడా. ఓడిపోతామనే టీడీపీ వరసబెట్టి ఎన్నికల బరి నుంచి తప్పుకుంటోంది అన్న మేసేజ్ కనుక ఆ పార్టీ క్యాడర్ కి చేరితే పూడ్చుకోలేనంత డ్యామేజ్ అయితే రావడం ఖాయమనే అంటున్నారు. మొత్తానికి ఏపీలో వైసీపీని ఎదుర్కోవడానికి తమ పార్టీయే రెడీ అంటున్నారు. తామే సరైన ఆల్టర్నేషన్ అని కూడా చెప్పేస్తున్నారు. బద్వేల్ లో తాము గట్టిగా పోరాడుతామని కూడా చెబుతున్నారు. ఎటూ టీడీపీ రేసులో లేనందువల్ల ఇపుడు బీజేపీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.