'తుపాకీ` పాఠకులైన మీకు.. సకుటుంబ సపరివారానికి నూతన సంవత్సరం 2021 శుభాకాంక్షలు! ఈ నూతన సంవత్సరం మీకు అన్ని విధాలా జయమవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తోంది తుపాకీ!!
ప్రతి వత్సరం..మన జీవితంలో అనేక నూత్న ఒరవడులు సృష్టించాలనే అభిలషిస్తాం. ఘన స్వాగతం పలుకుతాం. అయితే.. కొన్ని కొన్ని సార్లు మన ఆశలు, అభిలాషలు.. తడబడతాయి. అనుకున్నది ఒకటి.. జరిగేది మరొకటి.. అన్నట్టుగా పరిస్థితులు మారిపోతాయి. అయినా.. అన్నీ మన మంచికే అనుకునే మానవ మనస్తత్వం.. మనలను అనేక ఒడిదుడుకుల నుంచి ముందుకు నడిపిస్తూనే ఉంటుంది.
2020వ సంవత్సరం.. ఇలానే గడిచిపోయింది. 365 రోజుల కిందట.. ఖచ్చితంగా ఇదే రోజు.. ఎన్నో ఆశలతో 2020కి ఘన స్వాగతం పలికాం. కానీ.. మన ఆశలు.. ఆశయాలు.. కరోనా తుడిచిపెట్టేసింది. ప్రపంచం మొత్తం బాధా తప్త హృదయంతో అల్లాడిపోయింది. ఆర్థిక వ్యవస్థ అల్లాడిపోయింది. లక్షల సంఖ్యలో ప్రజలు మృత్యుకౌగిలి చేరిపోయారు. ఇదో విపత్తు! ఎవరూ ఊహించింది కాదు. నూత్న సంవత్సరం ఇలా ఉంటుందని, ఇంత బాధాకరమైన పరిస్థితిని ఈ ప్రపంచం చవిచూడాల్సి ఉంటుందని ఎవరూ ఊహించలేదు. అయితే.. మన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని, ప్రకృతిని సంరక్షించుకోవాలన్న స్పృహను మనకు ఈ కరోనా మరింత ద్రుఢతరం చేసింది. పరిసరాల శుభ్రత, వ్యక్తిగత శుభ్రతకు పెద్దపీట వేయాలన్న విషయాన్ని నిస్సందేహంగా మనకు నేర్పించింది ఈ సంవత్సరమే!
కాలం గిర్రున తిరిగింది! మరో నూతన సంవత్సరం మన ముంగిట వాలిపోయింది. భవిష్యత్తుపై అనేక ఆశలు రేకెత్తిస్తూ.. ప్రతి ఒక్కరిలోనూ ఆశల తలంపులను ప్రోదిచేస్తూ.. 2021 వచ్చేసింది. వ్యక్తుల మధ్య బంధాలు, సంబంధాలు, మన ఇల్లు, మన వీధి, మన వార్డు, మన నియోజకవర్గం, మన జిల్లా, మన రాష్ట్రం మన దేశం సుభిక్షంగా ఉండాలనే ఆకాంక్షను పెంచుతూ.. వచ్చిన 2021 కి ఘన స్వాగతం పలుకుతోంది `తుపాకీ`. నిత్య నూతన వార్తలతో ఆబాల గోపాలనికీ అవసరమైన వార్తా శ్రవంతిని ఎప్పటిలాగే మీకు అందిస్తూ.. మరింతగా మీ జీవితాలతో పెనవేసుకుని పోయే ద్రుఢ సంకల్పం చెప్పుకొంటూ.. నిఖార్సయిన, నిజమైన వార్తలకు వేదికగా నిలిచిన `తుపాకీ` మున్ముందు మరింత బాధ్యతగా మీకు వార్తల విందు చేస్తుందని పేర్కొంటూ.. పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతోంది... మీ.. మన.. తుపాకీ!!