హార్ధిక్ పాండ్య ఆమెకు పడిపోయాడా?

Update: 2016-03-26 07:34 GMT
భారత క్రికెట్ జట్టులోకి వచ్చి కాస్త ఫేమ్ సంపాదిస్తే చాలు.. ఇక ఆ ఆటగాడి కోసం అమ్మాయిలు క్యూ కట్టేస్తారంతే. చోటా మోటా క్రికెటర్లే కోట్లు సంపాదించేస్తున్న రోజులివి. ఇక ఇండియన్ క్రికెట్ టీంకి ఆడుతూ.. ఫేమస్ అయితే.. ఇక సంపాదనకు కొదవేముంటుంది? ఇలాంటోళ్లను పట్టేయడానికి అమ్మాయిలు కూడా రెడీగానే ఉంటారు. ఈ మధ్యే టీమ్ ఇండియాలోకి వచ్చి చాలా త్వరగా పాపులర్ అయిపోయిన ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్య కోసం కూడా అమ్మాయిలు అలాగే క్యూ కట్టేస్తున్నారు. అతడి ఫేమ్ ను వాడేసుకుని పాపులర్ అయిపోవడానికి ట్రై చేస్తున్నారు. లిషా శర్మ అనే కోల్ కతా మోడల్ కూడా ఇప్పుడు అదే పనిలో ఉంది.

ఈమె పాండ్యాకు దాదాపు ఏడాది నుంచి పరిచయం. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగినట్లున్నారు. ఐతే పాండ్య మూడు నెలల ముందు వరకు అంత పాపులర్ ఏమీ కాదు. ఐపీఎల్లో ఆడినప్పటికీ మరీ గొప్ప పేరేమీ సంపాదించలేదు. ఐతే మూడు నెలల కిందట అనుకోకుండా భారత జట్టులోకి వచ్చాడు. క్లిక్ అయ్యాడు. మొన్నటి బంగ్లాదేశ్ మ్యాచ్ లో చివరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేయడంతో అతడి పేరు మార్మోగిపోయింది. ఈ నేపథ్యంలో పాండ్య తన బాయ్ ఫ్రెండ్ అన్న తరహాలో కలరింగ్ ఇచ్చేస్తోంది లిషా. ‘మై బూ..’ అంటూ ట్విట్టర్లో హార్ధిక్ పాండ్యతో తాను కలిసున్న ఫొటో పెట్టి.. జనాల్లో క్యూరియాసిటీ పెంచింది లిషా. ఇంతకుముందు పాండ్యతో కలిసి దిగిన ఫొటోలన్నీకూడా షేర్ చేస్తోంది లిషా. పాండ్య డేటింగ్ చేయడానికి బాగా పనికొస్తాడని కూడా ఆమె వ్యాఖ్యానించడం విశేషం. పాండ్య నిజంగా లిషాకు పడిపోయాడో లేదో కానీ.. అతడి పేరు చెప్పి తను పాపులర్ అయిపోదామని భావిస్తున్నట్లుంది లిషా.
Tags:    

Similar News