మోడీతో పెట్టుకోవటానికి కొమ్ములు తిరిగిన నేతలు సైతం వెనకాడుతున్న వేళ.. తాను షాక్ ఇస్తానన్న ధీమాను ప్రదర్శించారు హార్దిక్ పటేల్. ఉద్యమ నేతగా మోడీని ఒకదశలో ఉక్కిరిబిక్కిరి చేసిన ఆయన.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ అండ్ కోకు చుక్కలు చూపిస్తారన్న అభిప్రాయం బలంగా వినిపించింది.
మోడీకి షాకిచ్చే మొనగాడిగా హార్దిక్ మీద కోటి ఆశలు పెట్టుకున్నోళ్లకు కొదవలేదు. కానీ.. ఇలాంటి హార్దిక్ లు ఎంతమంది వచ్చినా తన మంత్రాంగంతో ఊహించని పరిణామాల్ని తెర మీదకు తీసుకురాగలిగిన సత్తా మోడీకి ఉందన్న విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది. గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. అనూహ్యంగా రాజకీయ ముఖ చిత్రం మొత్తంగా మారిపోయింది. ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపిస్తారని భావించిన హార్దిక్ కు భారీ షాక్ తగిలే వైనం తాజాగా చోటు చేసుకుంది. హార్దిక్ పటేల్ కు ప్రధాన అనుచరులుగా చెప్పుకునే వరుణ్ పటేల్.. రేష్మ పటేల్ లు బీజేపీ గూటికి చేరుతున్న ప్రకటించి షాకిచ్చారు.
హార్దిక్ పటేల్ నిర్వహించే పటిదార్ అనామత్ ఆందోళన్ సమితిలో కీలక నేతలుగా చెప్పే ఈ ఇద్దరు.. అనూహ్యంగా కాషాయ కండువా కప్పుకోవటం ఇప్పుడు సంచలనంగా మారింది. బీజేపీ చీఫ్ అమిత్ షా.. గుజరాత్ సీఎం విజయ్ రూపానీ.. డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ తో భేటీ అయిన వీరిద్దరూ అనంతరం బీజేపీలోకి చేరేందుకు ఓకే అన్నారు. ఆపై గుజరాత్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జీతు నేతృత్వంలో మీడియా సమక్షంలో పార్టీలో చేరేందుకు సముఖత వ్యక్తం చేయటం హార్దిక్ కు పెద్ద దెబ్బగా అభివర్ణిస్తున్నారు.
బీజేపీలో చేరనున్నట్లుగా ప్రకటించిన వెంటనే వీరిద్దరి నోటి నుంచి తూటాల్లాంటి మాటలు పేలాయి. హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్ గా వ్యవహరిస్తూ.. ఉద్యమం పేరుతో ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపించారు. పటేళ్లను ఓబీసీ కోటాలోకి చేర్చటమే తమ లక్ష్యమని పేర్కొన్న వారు.. ఈరోజు (ఆదివారం) బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. తాజా పరిణామం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.