బ‌య‌టకు వ‌చ్చిన హార్దిక్ శృంగార సీడీ?

Update: 2017-11-14 04:37 GMT
ప్ర‌ధాని మోడీ సొంత రాష్ట్ర‌మైన గుజ‌రాత్ లో ఇప్పుడు ఎన్నిక‌ల వేడి పీక్స్‌కు చేరింది. ఈ ఎన్నిక‌లకు మోడీ ఇమేజ్‌ కు లింకు ఉండ‌టంతో ఈ ఎన్నిక‌ల్ని బీజేపీ ప్రిస్టేజ్ గా తీసుకుంది. అదే స‌మ‌యంలో మోడీని దెబ్బ తీయ‌టానికి గుజ‌రాత్ ఎన్నిక‌ల‌కు మించిన అవ‌కాశం మ‌రొక‌టి ఉండ‌ద‌ని విపక్షాలు భావిస్తున్నాయి. గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌కున్నా ఫ‌ర్లేదు.. ఇప్పుడు బీజేపీకి ఉన్న సీట్ల‌ను గ‌ణ‌నీయంగా త‌గ్గించినా.. అది అద్భుత ఫ‌లిత‌మేన‌న్న ఆశ విప‌క్ష పార్టీల్లో క‌నిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. క‌మ‌ల‌నాథుల‌కు మ‌హా ఇబ్బందిగా మారిన ప‌టేళ్ల రిజ‌ర్వేష‌న్ పోరాట నేత హార్దిక్ ప‌టేల్ కు సంబంధించిన సెక్స్ సీడీ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చి క‌ల‌క‌లం రేపుతోంది. హార్దిక్ ప‌టేల్ అని చెబుతున్న ఈ సీడీ ఇప్పుడు గుజరాత్ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఈ సీడీపై హార్దిక్ ప‌టేల్ రియాక్ట్ అయ్యారు. కీల‌క‌మైన గుజ‌రాత్ ఎన్నిక‌ల వేళ‌.. వ్యూహాత్మ‌కంగానే ఈ మార్ఫింగ్ వీడియోను తెర మీద‌కు తీసుకొచ్చార‌ని చెబుతున్నారు హార్దిక్ ప‌టేల్‌. ఒక  మ‌హిళ‌తో శృంగారం చేస్తున్న‌ట్లుగా హార్దిక్ (?)  పోలిక‌లు ఉన్న వ్య‌క్తి  వీడియోలో క‌నిపిస్తున్నారు. వీడియోలో ఉన్న‌ది హార్దిక్ ప‌టేల్ నా?అన‌్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

ఈ సీడీపై హార్దిక్ రియాక్ట్ అయ్యారు. దేశం బ‌య‌ట నుంచే ఈ మార్ఫింగ్ సీడీని అప్ చేసి ఉంటార‌ని చెబుతున్న ఉద్య‌మ నేత‌.. త‌న స‌త్తా ఏమిటో బీజేపీ తెలుస‌ని.. అందుకే ఈ త‌ర‌హా దిగ‌జారుడు రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతోంద‌ని మండిప‌డ్డారు. త‌న‌పై బుర‌ద జ‌ల్లే కార్య‌క్ర‌మంలో భాగంగా బీజేపీ.. ఈ త‌ర‌హా సీడీల‌ను  విడుద‌ల చేస్తుంద‌ని గ‌తంలోనే తాను చెప్పిన‌ట్లుగా వెల్ల‌డించారు. మొత్తంగా హార్దిక్ పేరిట విడుద‌లై వైర‌ల్ అవుతున్న వీడియో ఇప్పుడు గుజ‌రాత్ లో సంచ‌ల‌నంగా మారింది.

Full View
Tags:    

Similar News