తెలుగు రాష్ర్టాల మధ్య కొత్త పంచాయతీ మొదలైంది. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం కేంద్రంగా ఇరు రాష్ర్టాల మధ్య పంచాయతీ మొదలైంది. ఏపీ-తెలంగాణ రాష్ర్టాల భారీ నీటిపారుదల శాఖ మంత్రుల చర్చల పర్వం విఫలమైంది. దీంతో ఇటు తెలుగు రాష్ర్టాలే కాకుండా పొరుగు రాష్ట్రమైన కర్ణాటకతో కూడా పేచీ మొదలైంది.
తెలంగాణ ప్రభుత్వం వాదన ప్రకారం తాజాగా తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంపైనా ఫిర్యాదు చేసి కంటగింపు ధోరణి ప్రదర్శిస్తోంది. ఆర్డీఎస్ ఆనకట్ట తర్వాత 42 కి.మీటర్ల కాల్వ పరిధి కర్ణాటకలో ఉంది. తర్వాత 42వ కిలోమీటర్ నుంచి 143వ కిలోమీటర్ వరకు తెలంగాణ పరిధిలో ఉంది. కర్ణాటకలోని ఆయకట్టుకు 1.2 టీఎంసీలను - తెలంగాణలోని 86,500 ఎకరాల ఆయకట్టుకు 15.9టీఎంసీలు.. తుంగభద్ర నదిపై నిర్మించిన ఆర్డీఎస్ కింద రెండు రాష్ర్టాలకు కలిపి మొత్తం 17.1 టీఎంసీలను బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. ఈ విధంగా తుంగభద్ర నుంచి తమకు 15.9 టీఎంసీల జలాలు హక్తుభుక్తంగా రావాలని తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది.
అయితే, దశాబ్దాలుగా ఏనాడూ ఐదారు టీఎంసీలకు మించి నీళ్లు రాకపోవడంతో ఆర్డీఎస్ ఆయకట్టులోని సుమారు 55,600 ఎకరాల రైతులు అల్లాడిపోతున్నారు. తెలంగాణలోని ఆర్డీఎస్ కాల్వలు ధ్వంసమవడం, ఆదిలో ఉన్న తూములన్నీ తెరిచి ఏపీ వైపునకు నీటిని మళ్లించుకోవడంతో పాటు కర్ణాటకలోని 42 కిలోమీటర్ల కాల్వల పొడవునా అక్కడి రైతులు మోటర్లతో నీటిని తోడుకోవడం.. ఇలా అనేక కారణాల వల్ల కేటాయింపు మేరకు తెలంగాణ వైపు నీళ్లు రావడం లేదు. ఈ సమస్య పరిష్కారానికి ఆర్డీఎస్ ఆనకట్ట మరమ్మతు (జాకెటింగ్)తో పాటు కాల్వల ఆధునీకరణ చేపట్టాలని ఉమ్మడి రాష్ట్రంలోనే నిధులు మంజూరు చేసి - పనులు మొదలుపెట్టినా అవి ఒక్క అడుగు ముందుకు సాగలేదని అంటోంది.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్డీఎస్ మరమ్మతు ఆధునీకరణ పనుల్లో వేగం పెంచింది. అయితే కర్ణాటక పరిధిలో జరగాల్సిన పనులకు సంబంధించి మరోవైపు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ఉండటంతో ఏపీ సర్కారు ఉద్దేశపూర్వకంగా ఆ పనులు జరుగకుండా అడ్డుకుంటోందని మండిపడుతోంది. ఆర్డీఎస్ ఆయకట్టు రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని సవరించి - న్యాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తుమ్మిళ్ల పథకాన్ని చేపట్టింది. రూ.783 కోట్లతో చేపట్టిన ఈ పథకానికి మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేయగా పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఆర్డీఎస్ కు ఉన్న 15.9 టీఎంసీల కేటాయింపును సంపూర్ణంగా వాడుకొని, 86,500 ఎకరాలకు సాగునీరు అందించడమే తుమ్మిళ్ల ఉద్దేశం తప్ప అదనపు నీటి వినియోగానికి కాదు. అయినా కేసీ కెనాల్ ఆయకట్టుకు ఇబ్బంది కలుగుతుందని కృష్ణా బోర్డుకు ఏపీ ఫిర్యాదు చేయడంలో అర్థం లేదని తెలంగాణకు చెందిన నిపుణులు అంటున్నారు.
మరోవైపు ఇటీవల కర్ణాటక జలవనరుల మంత్రి పాటిల్ సూచన మేరకు త్రైపాక్షిక సమావేశం ఏర్పాటుకు సిద్ధమయ్యారు. తేదీ కూడా మీరే నిర్ణయించాలని హరీశ్ రావు సూచించినా ఏపీ మంత్రి మౌనమే వహించారని తెలంగాణ ఆక్షేపిస్తోంది.