రాబోయే ఎన్నికల్లో గులాబీ దళపతి కేసీఆర్ ప్రస్తుత ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజక వర్గం నుంచి పోటీ చేయడం లేదా? నియోజక వర్గంలో నెలకొన్న అసంతృప్తుల గురించి బహిరంగంగా జరుగుతున్న పరిణామాలతో పాటుగా - ఇంటెలిజెన్స్ రిపోర్టుల నేపథ్యంలో గజ్వేల్ ను వదిలివెళ్లనున్నారా? ఈ క్రమంలో ఆయన సురక్షితమైన నియోజకవర్గమైన సిద్ధిపేటను ఎంచుకున్నారా? అందులో భాగంగా తన మేనల్లుడు హరీశ్ రావు ను గజ్వేల్ నుంచి బరిలో దింపుతూ - తాను సిద్ధి పేట నుంచి పోటీ చేయనున్నారా? ఇవన్నీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్ చర్చలు.
గత ఏడాది కాలంగా సర్వేల మీద సర్వేలు చేయిస్తున్న టీఆర్ ఎస్ అధినేత - ఇప్పుడు గజ్వేల్ తోపాటు మరో సురక్షిత నియోజకవర్గం వైపు దృష్టిపెట్టారని ప్రచారం జరుగుతోంది. గజ్వేల్ లోనూ ఎప్పటికప్పుడు సర్వేలు చేయించినప్పటికీ - స్థానిక ప్రజలు గుంభనంగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీచేయడం అప్పట్లో తమ అదృష్టంగా భావించిన స్థానిక ప్రజలు - ఇప్పుడు ఆ అభి ప్రాయాన్ని మార్చుకున్నారని సమాచారం. అంతేగాక అయన నియోజకవర్గానికి రావడం మూలంగా స్థానికులు ఇబ్బంది పడ్డారని తెలిసింది. అయన ఫాంహౌజ్ లో ఉన్న రోజుల్లో రోడ్లు మూసివేయడం - అనేక సందర్భాల్లో అంతరాయం కలగడం - ఇబ్బందులు తలెత్తడం జరిగిందనే భావనలో స్థానికులు ఉన్నట్టు రిపోర్ట్ లు వచ్చినట్లు సమాచారం. గజ్వేల్ నుంచి సీఎం ప్రాతినిథ్యం వహించినా - ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదనే నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్టు అంటున్నవారు లేకపోలేదు. ఇందుకోసం గజ్వేల్ అభివృద్ధి అథారిటీ(గడ)ని ఏర్పాటు చేసినా అభివృద్ధి మాత్రం సీఎం స్థాయిలో చోటు చేసుకోలేదని నిఘా వర్గాలకు స్థానిక ప్రజల నుంచి అందిన సమాచారాన్ని తమ నివేదికల్లో పేర్కొన్నట్టు తెలిసింది. ఎర్రవెల్లిలోని తన 70 ఎకరాల ఫాం హౌజ్ కోసమే కొంత మేర అభివృద్ధి పేర హడావుడి చేశారనీ - అంతే తప్ప మరే ఇతర అభివృద్ధి పనులూ అనుకు న్నంత జరగలేదనే అభిప్రాయంతో గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు ఉన్నట్టు విపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇప్పటికే కొందరు గజ్వేల్ ద్వితీయ శ్రేణి నాయకత్వంతో పాటు మరికొందరు ప్రతిపక్ష పార్టీల్లో చేరి తిరిగి టీఆర్ ఎస్ లో చేరారు.
అయితే, ముఖ్యమంత్రి నియోజకవర్గంలోని ప్రజలు ఇప్పుడు తమ అభిప్రాయాలనూ - మనసులోని మాటలను బయటకు చెబితే నష్టమని భావిస్తున్నట్టు తెలిసింది. ఈవీఎం లో ఓటు మీటను నొక్కడం ద్వారా కచ్చితమైన తీర్పును ఇచ్చేందుకు స్థానిక ప్రజలు నిర్ణయించుకున్నారని సమాచారం. ఇటీవల ఇంటెలిజెన్స్ నివేదిక నేపథ్యంలో సీఎం కేసీఆర్ సైతం పునరాలోచనలో పడ్డట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. కేవలం నిఘా వర్గాల నివేదికల పైనే ఆధారపడకుండా - ప్రయివేటు సంస్థలతోనూ సర్వేలు చేయించినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గజ్వేల్ కాకుండా మరో నియోజకవర్గంలోనూ పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగా హరీశ్ రావు పోటీ చేస్తున్న సిద్ధిపేటను ఎంచుకున్నట్లు సమాచారం.
ఇటీవల నియోజక వర్గంలో పుంజుకుంటున్న కాంగ్రెస్ ను ధీటుగా ఎదుర్కునేందుకు - పార్టీ పరంగా గెలుపుపై ఖచ్చితమైన విశ్వాసం కలిగించేందుకు హరీశ్ రావు సరైన వ్యక్తి అవుతారని భావిస్తూ...తాను సిద్ధిపేట నుంచి బరిలోకి దిగుతూ...హరీశ్ ను తన నియోజకవర్గానికి రప్పించేందుకు గులాబీ దళపతి ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం. అయితే, దీనికి హరీశ్ ఏమంటారు? మామ కోసం తన రాజకీయ జీవితంలో కీలకమైన నిర్ణయం తీసుకుంటారా? హరీశ్ నియోజకవర్గం మార్పుతో అసంతృప్తికి గురయ్యే క్యాడర్ కు ఏం సమాధానం చెప్తారు? ఈ ప్రశ్నలన్నింటికీ...కాలమే సమాధానం చెప్పాలి.