ఓవైపు కరోనా.. మరోవైపు లాక్ డౌన్. భౌతిక దూరం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటూ పదే పదే హెచ్చరికలు చేస్తున్న వేళ.. కీలక స్థానాల్లో ఉండే వారు అలాంటివాటిని పాటించకుంటే ఎలా? అన్నది ప్రశ్న. కరోనా వేళలో ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాల్సింది పోయి.. అధికారిక కార్యక్రమాల పేరుతో హడావుడి చేయటం ఎంతవరకు సబబు? అన్నది ప్రశ్నగా మారిందని చెప్పాలి.
రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ లోకి కాళేశ్వరం జలాల్ని పంపింగ్ చేసే కార్యక్రమం పెద్దదే కావొచ్చు. దాని ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన మైలేజీని సొంతం చేసుకోవాలని తపించటం తప్పేం కాదు. కానీ.. కరోనా లాంటి ప్రత్యేక వేళలో ఇలాంటి కార్యక్రమాల్ని మరింత జాగ్రత్తగా నిర్వహిస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాళేశ్వరం నీరు సిద్ధిపేట మండలంలోకి రావటం చూసిన మంత్రి హరీశ్ రావు ఉద్వేగానికి గురయ్యారు. రిజర్వాయర్ కోసం భూములు ఇచ్చిన రైతులు.. పని చేసిన కార్మికులు.. ఇంజనీర్లు.. అధికారులకు వందనాలు తెలిపిన హరీశ్.. ఈ కార్యక్రమం లో భాగంగా పెద్ద ఎత్తున అధికారులు తమతో ఉండటం ఏ మాత్రం సరికాదన్న విషయాన్ని మరిచారని చెప్పక తప్పదు.
హరీశ్ ఇలాకాలో జరిగిన ఈ కార్యక్రమంలో మరో మంత్రి కమ్ బావమరిది కేటీఆర్ సైతం హాజరయ్యారు. పంపింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంలో రిజర్వాయర్ నిర్మించిన కూలీలు.. ఇంజనీర్లను సన్మానించటం.. వారితో కలిసి మంత్రులు ఇద్దరు సహపంక్తి భోజనం చేయటం లాంటివి ఏమిటన్నది ప్రశ్నగా మారింది. ఒకవైపు వేడుకలు.. విందులు నిర్వహించొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన వైనాన్ని ఇద్దరు మంత్రులు మరిచిపోయారా? అన్నది ప్రశ్న. ప్రభుత్వం చేసిన పెద్ద పనిని గొప్పగా చాటి చెప్పుకోవాలంటే కరోనా తర్వాత పెద్ద ఎత్తున ప్రకటనలు ఇవ్వటం.. ప్రచార కార్యక్రమాల్ని నిర్వహించటం బాగుంటుంది. అంతేకానీ.. విపత్తు వేళలో ఇంత హడావుడి చేయటం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. కాళేశ్వరం జలాల పంపింగ్ విషయం లో మంత్రులు కేటీఆర్.. హరీశ్ రావుల హడావుడి సరి కాదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.